టాటా పంచ్: షాకింగ్.. ఇక ఆ ఫీచర్ ఉండదు?

Purushottham Vinay
ఇండియాస్  టాప్  ఆటోమొబైల్  కంపెనీగా దూసుకుపోతున్న  'టాటా మోటార్స్' నుంచి వచ్చిన మినీ SUV కార్ 'టాటా పంచ్' ఇండియన్  మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న కంపెనీ బ్రాండ్. ఇది చిన్న SUV అయినప్పటికీ ఇందులోని ఫీచర్స్ మాత్రం భారీగానే ఉన్నాయి.మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ మాత్రమే కాకుండా సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరిన ఈ టాటా పంచ్ ఇప్పుడు 'ఐడెల్ సార్ట్/స్టాప్' అనే ఫీచర్ ని కోల్పోయింది.అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం, తన పంచ్  బేస్ వేరియంట్ అయిన 'ప్యూర్' ట్రిమ్ మాత్రమే ఈ 'ఐడెల్ సార్ట్/స్టాప్' ఫీచర్ కోల్పోతుందని తెలుస్తోంది. కాగా మిగిలిన మూడు ట్రిమ్స్ 'అడ్వెంచర్, అకాప్లిష్డ్ అండ్  క్రియేటివ్' ఈ ఫీచర్ ని కలిగి ఉంటాయి. అంతే కాకుండా టాటా పంచ్ కజిరంగా ఎడిషన్  ఇంకా క్యామో ఎడిషన్‌లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.బేస్ వేరియంట్ లో ఈ ఫీచర్ తొలగించడం మినహా మిగిలిన ఎటువంటి మార్పులు జరగలేదు, అందువల్ల టాటా పంచ్ కొనుగోలుదారులు దీనిని గుర్తించాలి.


డిజైన్ లో కూడా ఎటువంటి మార్పులు జరగలేదు.ఇక 'ఐడెల్ సార్ట్/స్టాప్' ఫీచర్ ఉపయోగం విషయానికి వస్తే, ఐడెల్ మోడ్‌లో ఉన్నప్పుడు ఇంజిన్‌ ఆటోమాటిక్ గా ఆఫ్ అవుతుంది, అయితే క్లచ్‌ని నొక్కడం ద్వారా మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా ఫ్యూయెల్ కొంతవరకు ఆదాచేయబడుతుంది. ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్. ఈ ఫీచర్ ఇప్పుడు బేస్ వేరియంట్ లో లేకపోవడం వల్ల కొనుగోలుదారులు కొంత నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది.ఇంజిన్ లో ఎటువంటి మార్పులు లేదు, అందువల్ల టాటా పంచ్ అదే 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్  ఇంకా అలాగే 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్  ఇంకా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: