ఇక భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా, ఎట్టకేలకు తమ సరికొత్త 2022 ఆల్టో కె10 కారును మార్కెట్లో విడుదల చేసింది.కేవలం రూ.3.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే కంపెనీ ఈ సరికొత్త ఆల్టో కె10 కార్ ను పరిచయం చేసింది. ఆల్టో కె10 మొత్తం కూడా 6 వేరియంట్లలో విడుదల చేయబడింది, వీటిలో నాలుగు మ్యాన్యువల్ ఇంకా రెండు ఆటోమేటిక్ వేరియంట్లు కూడా ఉన్నాయి.ప్రస్తుత ఆల్టో 800 నుండి ప్రత్యేకంగా కనిపించేలా చేయడం కోసం కంపెనీ ఈ కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో K10 కార్ డిజైన్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. ఇందులో కొత్త స్వెప్ట్‌బ్యాక్ హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు ఇంకా సుజుకి బ్యాడ్జ్ పైన ఉన్న పెద్ద సింగిల్-పీస్ గ్రిల్ ఉన్నాయి. కొత్త ఆల్టో కె10 కార్ లో ఫ్రంట్ బంపర్ కూడా కొత్తగా ఉంటుంది. ఇంకా అలాగే ఈ హ్యాచ్‌బ్యాక్ రూపాన్ని మరితంత మెరుగుపరచడంలో సహాయపడటానికి అక్కడక్కడా క్రోమ్ బిట్స్ అనేవి కూడా ఉన్నాయి.ఈ కొత్త 2022 మారుతి ఆల్టో కె10 సైడ్ డిజైన్ ను గమనిస్తే, సిల్వర్ వీల్ కవర్‌లతో కూడిన 13 ఇంచ్ స్టీల్ వీల్స్, ఫెండర్-మౌంటెడ్ సైడ్ ఇండికేటర్‌లు ఇంకా అక్కడక్కడా క్రోమ్ యాక్సెంట్స్ కనిపిస్తాయి. ఇక కొత్త ఆల్టో కె10 వెనుక భాగాన్ని కనుక గమనిస్తే, ఇందులో కొత్త స్క్వేర్డ్-ఆఫ్ టెయిల్ లైట్లు ఇంకా ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ ఇంకా కొత్త రియర్ బంపర్ అలాగే టెయిల్‌గేట్‌పై మరిన్ని క్రోమ్ ఎలిమెంట్స్ ఉంటాయి.
ఇక ఆల్టో కె10 లోపలి భాగంలో ప్రధానంగా మన దృష్టిని ఆకర్షించేది, ఇందులోని డ్యాష్‌బోర్డ్ మధ్యలో అమర్చిన కొత్త పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే యూనిట్. అలాగే ఇదొక 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ యూనిట్. ఈ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో ఇంకా యాపిల్ కార్‌ప్లే టెక్నాలజీ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఆల్టో కె10 కార్ లోపలి భాగం చాలా వరకు కూడా నలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉంటుంది. ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఇంకా ఎయిర్ వెంట్స్ చుట్టూ సిల్వర్ యాక్సెంట్‌లు కనిపిస్తాయి, ఇవి కారు లోపల ప్రీమియం లుక్‌ని కూడా తెచ్చిపెడుతాయి.ఇక మారుతి సుజుకి ఆల్టో కె10 కంపెనీ పాపులర్ K10C డ్యూయెల్ జెట్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ 998సీసీ ఇంకా త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 66 బిహెచ్‌పి శక్తిని ఇంకా 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే కొత్త ఆల్టో కె10లోని ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో కూడా లభిస్తుంది. ఇది లీటరుకు మొత్తం 24.9 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.