టాటా మోటార్స్ 'టాటా పంచ్' దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలో ఉత్పత్తిలో ఇంకా విక్రయాల్లో అరుదైన రికార్డ్ సృష్టించింది.ఇక మైక్రో SUV విభాగంలో విడుదలైన 'టాటా పంచ్' కార్ ఇప్పటికి ఒక లక్ష యూనిట్లను విక్రయించి కొత్త మైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. 2021 అక్టోబర్ నెలలో అడుగుపెట్టిన టాటా పంచ్ ఇప్పటి వరకు కూడా మొత్తం 1,00,000 యూనిట్ల విక్రయాలను సాధించినట్లు,ఇంకా ఆ 1,00,000వ యూనిట్‌ను టాటా మోటార్స్ పూణేలోని తయారీ కేంద్రంలో విడుదల చేసింది. కేవలం 10 నెలల కాలంలోనే ఇంత గొప్ప రికార్డ్ సృష్టించిన తొలి ఎస్‌యూవీ ఇదేనని టాటా మోటార్స్ చాలా సగర్వంగా తెలిపింది.నిజానికి టాటా పంచ్ కంపెనీ నుంచి ఇది అతి తక్కువ ధర వద్ద లభిస్తున్న మైక్రో SUV. ఇది చాలా అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన పరికరాలను కలిగి ఉండటమే కాకుండా అత్యధిక సేఫ్టీ ఫీచర్స్ ని కూడా కలిగి ఉంది. ఈ కారణంగానే ఈ SUV కార్ కి మార్కెట్లో ఇంత డిమాండ్ ఉంది.ఇక టాటా పంచ్ ధర ఇప్పుడు దేశీయ మార్కెట్లో రూ. 5.93 లక్షల నుండి రూ. 9.48 లక్షల మధ్య ఉంది.
అలాగే ఇది ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడింది. ఈ పంచ్ మైక్రో SUV నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) ఇంకా క్రియేటివ్ వేరియంట్స్.ఈ టాటా పంచ్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు ఇంకా 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్ అలాగే 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది.టాటా పంచ్ చాలా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ SUV లో సిగ్నేచర్ గ్రిల్ కూడా చూడవచ్చు. ఇక ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ అనేది ఇరువైపులా ఉంది. అలాగే ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. ఈ Tata Punch సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు ఇంకా డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.