అవెంటడార్ అల్టిమే కూపే: ఇండియాలో ఫస్ట్ డెలివరీ!

Purushottham Vinay
ఇక భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇటాలియన్ సూపర్ కార్ బ్రాండ్స్ లో ఒకటి 'లంబోర్ఘిని' (Lamborghini).ఇంకా ఈ కంపెనీ ఇప్పుడు తన 'అవెంటడార్ అల్టిమే కూపే' (Aventador Ultimae Coupe) ని భారతదేశపు కస్టమర్ కి డెలివరీ చేసింది. అలాగే కంపెనీ ఈ సూపర్ కార్ భారతదేశంలో మొట్ట మొదటిది కావడం విశేషం. భారతదేశంలో అడుగుపెట్టిన ఈ ఫస్ట్ 'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కూపే' గురించి మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ఈ ఇటాలియన్ సూపర్ కార్ తయారీదారు లంబోర్ఘిని ఇప్పటికే 'అవెంటడార్ అల్టిమే' రెండు డోర్ల వెర్షన్‌ను భారతదేశంలో డెలివరీ చేసింది.ఇంకా ఈ అవెంటడార్ అల్టిమే ఎల్లో కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది.అయితే ఇక ఇప్పుడు డెలివరీ చేయబడిన మోడల్ 'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కూపే' ఇది వయోలా పాసిఫ్ పర్పుల్ కలర్ స్కీమ్‌లో చాలా చూడచక్కగా ఉంది. అయితే ఇది బ్రాంజ్ ఒరేడి యాక్సెంట్‌లను కూడా కలిగి. కావున ఇక ఇది బ్రేక్ కాలిపర్‌లతో పాటు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.


ఇక ఈ కొత్త 'అవెంటడార్ అల్టిమే కూపే' ఇంటీరియర్ విషయానికి కనుక వస్తే, ఇంటీరియర్ ఎక్కువ భాగం కూడా బ్లాక్ కలర్ ఉంది.ఇంకా అదే సమయంలో అక్కడక్కడా కూడా గోల్డ్ కలర్ స్టిచ్చింగ్ ని చూడవచ్చు.ఇక ఇది కారుకు మంచి స్పోర్టి అనుభూతిని అందిస్తుంది. అలాగే సీట్ల కింది అంచుల్లో వైట్ కలర్ ఉండటం కూడా మనం గమనించవచ్చు. ఇంకా అంతే కాకుండా సీట్ బెల్ట్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.అవెంటడార్ అల్టిమే కూపే అనేది దాని 'రోడ్‌స్టర్ వేరియంట్' మాదిరిగానే లిమిటెడ్ వెర్షన్. అయితే ఇక ఇది రోడ్‌స్టర్ వేరియంట్ కంటే కూడా 100 యూనిట్లు ఎక్కువుగా అందుబాటులో ఉంటాయి. అంటే కంపెనీ ఇప్పుడు తన 'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కూపే' ని మొత్తం 350 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. కానీ లంబోర్ఘిని రోడ్‌స్టర్ వేరియంట్ మాత్రం కేవలం కేవలం 250 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: