KTM 390 Adventure బైక్ విడుదల.. ధర, పూర్తి వివరాలు!

Purushottham Vinay
ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ కెటిఎమ్ (KTM) కంపెనీ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త 2022 మోడల్ కెటిఎమ్ 390 అడ్వెంచర్ (2022 KTM 390 Adventure) మోటార్‌సైకిల్ ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ అయ్యింది. కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ దాని ముందున్న మోడల్ తో కనుక పోలిస్తే చాలా భిన్నంగా కనిపిస్తుంది. దీని డిజైన్ ఇంకా అలాగే ఫీచర్లలో కంపెనీ అప్‌గ్రేడ్స్ చేసింది. ఇండియన్ మార్కెట్లో ఈ కొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ధర వచ్చేసి రూ. 3.28 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా డిసైడ్ చెయ్యబడింది.ఇక ఒక్కసారిగా ఇంత మొత్తం చెల్లించి ఈ బైక్‌ను కొనలేని కస్టమర్ల కోసం కేటీఎం కంపెనీ ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే, కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైక్ ను రూ. 6,999 నెలవారీ EMI వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త మోడల్‌ను గ్రే, బ్లాక్ ఇంకా అలాగే బ్లూ కలర్ ఆప్షన్లలలో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా, ఈ కొత్త కలర్ ఆప్షన్లన్నీ కూడా ఇప్పుడు KTM బ్రాండ్ సిగ్నెచర్ ఆరెంజ్ యాక్సెంట్స్ ఇంకా అలాగే బాడీ గ్రాఫిక్స్ ను కూడా అవి కలిగి ఉంటాయి.


అలాగే డిజైన్ పరంగా చూస్తే, ఇది ప్రసిద్ధ డాకర్ ర్యాలీలో ఉపయోగించిన అడ్వెంచర్ బైక్ మోడల్‌ లాగా ఉంటుంది.అలాగే సరిగ్గా అదే ఫీచర్లు ఇంకా అలాగే గ్రాఫిక్స్ డిజైన్‌తో కూడా వస్తుంది. ఇది అడ్వెంచర్ బైక్ కాబట్టి కఠినమైన రోడ్లపై కూడా చాలా సులువుగా ప్రయాణించేలా ఇది డిజైన్ చేయబడింది. మొత్తంమీద, ఈ బైక్ ఒక దృఢమైన ఫ్రేమ్‌పై నిర్మించబడి ఉండి ఇంకా అలాగే మంచి స్థిరత్వం ఇంకా అలాగే బలాన్ని కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇందులో రైడర్ అవసరాలకు అనుగుణంగా బాడీ ప్యానెల్‌లకు కంపెనీ అనేక సూక్ష్మమైన మార్పులను చేసినందున డిజైన్ అనేది ఇక కొంచెం ఎక్కువ ఏరోడైనమిక్‌గా కూడా కనిపిస్తుంది.ఇక ఇందులో రైడర్ స్మార్ట్ ఫోన్ చార్జింగ్ కోసం 12 వోల్ట్ ఛార్జింగ్ పోర్ట్ కూడా మంచి స్టాండర్డ్ గా లభిస్తుంది. ఇందులో రెండు రైడింగ్ మోడ్‌లతో పాటుగా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ కూడా మనకు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: