ఇండియన్ మార్కెట్ లోకి మినీ కూపర్ ఎలక్ట్రిక్ కార్..

Purushottham Vinay
ఫేమస్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ ఇండియా (MINI India) ఇండియన్ మార్కెట్లో 'మినీ కూపర్ ఎస్ఇ' (MINI Cooper SE) ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసింది. 'మినీ కూపర్ ఎస్ఇ' అనేది కంపెనీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర వచ్చేసి రూ. 47.20 లక్షలు. ఈ కొత్త మినీ ఎలక్ట్రిక్ కారు గురించి పూర్తి సమాచారం ఇప్పుడు ఇక్కడ తెలుసుకోండి.ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త 'మినీ కూపర్ ఎస్ఇ' (MINI Cooper SE) బుకింగ్స్ కూడా కంపెనీయే ఇప్పటికే ప్రారంభించింది. కాబట్టి డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభిస్తుంది. త్వరలో కంపెనీ కొత్త బ్యాచ్ బుకింగ్‌లను కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇక కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు మొదటి బ్యాచ్‌లో కేవలం 30 యూనిట్లను మాత్రమే చేర్చడం జరిగింది. కంపెనీ ఆఫీషియల్ వెబ్‌సైట్ నుండి రూ. 1 లక్ష అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాచ్‌లోని మొత్తం 30 యూనిట్లు కేవలం 2 గంటల్లోనే బుక్ అవ్వడం జరిగింది.


ఇక 'మినీ కూపర్ ఎస్ఇ' ఎలక్ట్రిక్ కారు డిజైన్ దాని మినీ కూపర్ లాగానే ఉంచబడింది, కానీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారులో కొన్ని చిన్న మార్పులు అనేవి ఉంటాయి. ఇలాంటి మార్పుల్లో ఒకటి ఫ్రంట్ గ్రిల్ అని చెప్పాలి. ఇది కారును మంచి ఏరోడైనమిక్‌గా చేస్తుంది. ఇక ఈ హ్యాచ్‌బ్యాక్‌కి ఫేస్‌లిఫ్ట్ ఇవ్వడానికి ఇంకా అలాగే కొత్త కలర్ ఆప్సన్స్ లో ఆకర్షణీయమైన ఎల్లో కలర్ యాక్సెంట్స్ బార్‌లు ఇంకా మినీ ఎలక్ట్రిక్ బ్యాడ్జ్‌లతో ఫిక్స్ చేయబడ్డాయి.ఇక మినీ ఇంటిగ్రేటెడ్ సర్క్యులర్ ఎల్ఈడీ DRLలతో రౌండ్ హెడ్‌లైట్‌ అనేది పొందుతుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ హాట్ హ్యాచ్‌బ్యాక్ కొత్త 17 ఇంచెస్ స్పోక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్ డిజైన్‌ను ఎల్లో కలర్ రిమ్‌లతో పొందుతుంది. ఇది చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కాకుండా, ఈ కారు పిల్లర్లు అన్ని కలర్ ట్రిమ్‌లలో బ్లాక్ కలర్ లో ఉంచబడ్డాయి. అందువల్ల ఇది కారుకు మంచి కాంట్రాస్ట్‌ని ఇస్తుంది.మినీ ఎలక్ట్రిక్ అనేది 3-డోర్ల కూపే, ఇది గో-కార్ట్ మంచి అనుభూతిని అందిస్తుంది. ఇది ఇమిడియేట్ టార్క్‌ను కూడా అందిస్తుంది.ఇక ఈ ఎలక్ట్రిక్ కారులో ఎగ్జాస్ట్ కూడా అసలు కనిపించదు. ఈ కారు 184 బిహెచ్‌పి పవర్ ఇంకా 270 ఎన్ఎమ్ టార్క్‌ ని అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: