
ఈ 3 రాత్రుళ్ళు బైక్ డ్రైవింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు...
* అందరికీ వేడుకలు ఘనంగా చేసుకోవాలి, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయాలి అని ఉంటుంది. కానీ అన్ని సార్లు పరిస్థితులు మనకు అనుకూలించకపోవచ్చు. కాబట్టి ఈ మూడు రోజులు అవసరం అనిపిస్తే తప్ప బైక్ రైడ్ కు వెళ్ళకపోవడం మంచిది.
* ఒకవేళ బయటకు వెళ్లినా మినిమం ఒక్కరు మాక్సిమం అంటే ఇద్దరు మాత్రమే బైక్ లో వెళ్ళండి. మాస్క్, శనితీజర్ లను తప్పక వాడండి. బయట వీలైనంత వరకు సామాజిక దూరం పాటించండి.
* బయట తిరగడం వలన కరోనా సంక్రమిస్తే అది మీకు మాత్రమే నష్టాన్ని కలిగించదు. మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులకు మరియు మీ స్నేహితుడి కుటుంబ సభ్యులకు వస్తుంది. వారి ద్వారా ఇంకెంతమందికి వస్తుందో మనము ఊహించలేము. కాబట్టి బయటకు వెళ్ళకపోవడం మంచిది.
* బైక్ రైడింగ్ సమయంలో కేవలం 40 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే మైంటైన్ చేయండి. ఎక్కువ స్పీడ్ వెళ్లడం వలన రోడ్లపై రద్దీ కారణంగా వేగాన్ని నియంత్రించడం చాలా కష్టం. దాని వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ... మీకు అవతలి వారికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది.
* బైక్ రైడింగ్ చేసే సమయంలో హెల్మెట్ తప్పనిసరి అని తెలుసుకోండి.
* అర్ధ రాత్రి వరకు బయట తిరగకండి.
* మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి.
* ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించండి.
ఇలా పైన తెలిపిన అన్ని జాగ్రత్తలు తీసుకుని మీరు, మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు సంతోషంగా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పండి.