ఆకట్టుకుంటున్న టీవీఎస్ జూపిటర్ 125.. ధర, వివరాలు..

Purushottham Vinay
ఇక ప్రముఖ టూ వీలర్ వాహన తయారు సంస్థ అయిన టీవీఎస్ కంపెనీ ఇండియా మార్కెట్లో తాజాగా కొత్త జూపిటర్ 125 స్కూటర్ విడుదల చేయడం జరిగింది. ఇక భారత మార్కెట్లో విడుదలైన ఈ కొత్త టీవీఎస్ జూపిటర్ 125 ధర వచ్చేసి రూ. 73,400 గా వుంది. ఇక ఈ కొత్త స్కూటర్ ఆధునిక ఫీచర్స్ ఇంకా అలాగే పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కొత్త టీవీఎస్ జూపిటర్ 125 గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక ఈ కొత్త టీవీఎస్ జూపిటర్ 125 మూడు వేరియంట్లలో మనకి అందుబాటులో ఉంటుంది. అవి డ్రమ్, డ్రమ్ అల్లాయ్ ఇంకా అలాగే డిస్క్ వేరియంట్లు. ఇక ఈ కొత్త స్కూటర్ 125 సిసి ఇంజిన్ ఇంకా మొబైల్ ఛార్జర్ అలాగే 33-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ కెపాసిటీ ఇంకా టీవీఎస్ ఇంటెలిగో టెక్నాలజీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ని కలిగి ఉంది.ఇక ఈ కొత్త స్కూటర్ లో ఎల్ ఈడీ హెడ్‌లైట్, ఆకర్షణీయమైన టెయిల్ లైట్ ఇంకా అలాగే గ్రాఫ్ రైల్ రిఫ్లెక్టర్ వంటివి ఉన్నాయి. అలాగే ఇందులో కంపెనీ యొక్క 3D లోగో కూడా ఇవ్వబడింది. ఇంకా అలాగే లోపల ప్యానెల్‌పై ప్రీమియం పెయింట్ కూడా ఉంది.
ఇక డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ దాని డిస్క్ వేరియంట్‌లో కూడా ఇవ్వబడటం జరిగింది.ఇక ఇవన్నీ కూడా స్కూటర్ యొక్క మొత్తం రూపాన్ని ఎంతగానో మరింత మెరుగుపరుస్తుంది.ఇక అలాగే ఈ స్కూటర్ ముందు భాగంలో మొబైల్ ఛార్జర్ ఇంకా అలాగే ఫ్యూయెల్ ఫిల్లర్ వంటివి కూడా ఉన్నాయి. ఇది వాహన వినియోగదారులకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ స్కూటర్ కి సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఇంకా అలాగే ఇంజిన్ ఇన్హిబిటర్ కూడా ఇవ్వబడింది. ఇక దీనితో పాటు దీని ముందు మంచి లెగ్ స్పేస్ అనేది కూడా ఇవ్వబడింది.ఇక ఈ కొత్త జుపీటర్ 125 స్కూటర్ ఈ విభాగంలో అతి పెద్ద సీటుని కూడా కలిగి ఉంది.ఇక అంతే కాకుండా దీనికి 33 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న సెగ్మెంట్‌లో ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఇవ్వబడిందని కంపెనీ పేర్కొనడం జరిగింది. ఇక ఇందులో రెండు హెల్మెట్స్ ఉంచడానికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది.ఇక ఈ స్కూటర్‌లో ఎకోట్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ అనేది కూడా ఇవ్వబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: