ఇండియాలో చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే..

Purushottham Vinay
ఇక ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ అనేది బాగా పెరిగిపోతోంది.ఇక ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయడం జరిగింది.ఇక మరికొన్ని కంపెనీలు కూడా కొత్త వాహనాలను విడుదల చేసే పనిలో బాగా నిమగ్నమవ్వడం జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ Komaki Electric (కోమకి ఎలక్ట్రిక్) కూడా ఇండియన్ మార్కెట్లో కొత్త Komaki XGT-X1 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రవేశపెట్టడం జరిగింది.ఇక ఈ Komaki XGT-X1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని కంపెనీ 2020 జూన్ నెలలో ఇండియన్ మార్కెట్లో విడుదల చెయ్యడం అనేది జరిగింది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ నివేదించడం జరిగింది. ఇక Komaki XGT-X1 ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు బ్యాటరీ ఆప్సన్స్ తో విడుదలవ్వడం జరిగింది.అవి ఒకటి జెల్ బ్యాటరీ కలిగి ఉన్న Komaki XGT-X1. ఇంకొకటి వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ ఉన్న Komaki XGT-X1. ఇక వీటి ధరలు వచ్చేసి వరుసగా (Komaki XGT-X1 జెల్ బ్యాటరీ) ధర వచ్చేసి రూ. 45,000 కంటే తక్కువ ఉంటుంది.

ఇక అలాగే లిథియం అయాన్ బ్యాటరీ Komaki XGT-X1ధర వచ్చేసి రూ. 60,000.గా ఉంటుంది.ఇక ఈ Komaki ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పటికే మార్కెట్లో దాదాపు 25,000 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మడం అనేది జరిగింది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ గా ఉండటంతో పాటు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫీచర్స్ అలాగే పరికరాలను కలిగి ఉంటుంది. అందుకే ఇది మార్కెట్లో ఇది మంచి ఆదరణ పొందడం జరుగుతుంది.ఇక Komaki XGT-X1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ చార్జితో ఎకో మోడ్‌లో 120 కిమీ వరకు పరిధిని అందించడం జరుగుతుంది.ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇంకా సైజ్-అప్ బిస్ వీల్స్ అనేవి ఉపయోగించబడ్డాయి.కాబట్టి వాహన వినియోగదారులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: