Audi e-Tron GT బుకింగ్స్ స్టార్ట్.. అడ్వాన్స్ ఎంతో తెలుసా?

Purushottham Vinay
ఇక జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి ఇండియా గడచిన జులై నెలలో ఇండియా మార్కెట్లో విడుదల చేసిన తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-ట్రోన్ (e-Tron) లో కంపెనీ ఇప్పుడు GT వేరియంట్ ను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది.ఇక ఇందులో భాగంగా కంపెనీ నేటి  Audi e-Tron GT (ఆడి ఇ-ట్రోన్ జిటి) కోసం బుకింగ్స్ ను కూడా ప్రారంభించడం జరిగింది. audi e-Tron GT ఎలక్ట్రిక్ కారు కోసం కంపెనీ బుకింగ్ అడ్వాన్స్ ను రూ. 10 లక్షలుగా నిర్ణయించడం జరిగింది.ఇక ఈ సూపర్ కారును కొనాలనుకునే కస్టమర్లు రూ. 10 లక్షల టోకెన్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చునట. ఇది స్టాండర్డ్ e-Tron కన్నా ఎక్కువ పవర్ కలిగిన పెర్ఫార్మెన్స్ వేరియంట్ గా ఉంటుంది.ఇక సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్ లో ఈ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి ఇండియా మార్కెట్ కు ఇన్పోర్ట్ చేసుకోనున్నారు.ఇంటర్నేషనల్ మార్కెట్లలో audi ఇప్పటికే ఈ రెండు వేరియంట్లను అమ్ముతుంది.

ఇక audi e-Tron GT ఎలక్ట్రిక్ కారులో 85 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది.ఇక ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్లు స్టాండర్డ్ మోడల్ 469 hp పవర్ ని విడుదల చేస్తుండగా, RS వేరియంట్ 590 hp పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది.ఇక స్టాండర్డ్ ఫోర్-డోర్ల కూప్ EV వచ్చేసి పూర్తి ఛార్జ్‌ పై 487 కిమీ డ్రైవింగ్ రేంజ్ ను ఆఫర్ చేస్తుండగా RS ట్రిమ్ పూర్తి చార్జ్ పై 471 కిమీ రేంజ్ ను ఆఫర్ చేయడం జరిగింది.అలాగే పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, audi e-Tron GT కార్ కేవలం 4.1 సెకన్లలో సున్నా నుండి గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చాలా ఈజీగా చేరుకోగలదు. స్టాండర్డ్ వేరియంట్ హై స్పీడ్ వచ్చేసి గంటకు 245 కిమీ గా ఉంటుంది.ఇక ఇందులోని ఆర్ఎస్ వెర్షన్ కేవలం 3.3 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకోగలదు. అలాగే, ఈ స్పోర్టీయర్ వెర్షన్ హై స్పీడ్ వచ్చేసి గంటకు 250 కిమీ గా ఉంటుంది. audi ఇంకా porsche కంపెనీలు కలిసి అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రిక్ కారు బరువు సుమారు 2300 కిలోల బరువు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: