పల్సర్ బైక్ పై డిస్కౌంట్... త్వరపడండి..

Purushottham Vinay
ఫేమస్ ఇండియన్ బైక్ కంపెనీ Bajaj Auto, ఇండియా మార్కెట్లో అమ్ముతున్న పాపులర్ మోటార్‌ బైక్ బ్రాండ్ Pulsar సిరీస్ లో కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై ధరల తగ్గింపులను అందిస్తోంది. ఇక ఈ పండుగ సీజన్ లో Bajaj Pulsar NS160 ఇంకా Bajaj Pulsar 150 SD లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 4,000 డిస్కౌంట్ ను పొందవచ్చు.ఇక అంతేకాకుండా, ఈ రెండు మోడళ్లను కూడా కంపెనీ తక్కువ డౌన్‌పేమెంట్ స్కీమ్ తో అందించడం జరుగుతుంది. వీటి కోసం తక్కువ డౌన్‌పేమెంట్ ను కంపెనీ రూ. 18,348 గా నిర్ణయించడం జరిగింది. ఈ ఆఫర్లు పరిమితం కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని అలాగే మరిన్ని వివరాల కోసం దగ్గరలోని బజాజ్ డీలర్‌షిప్ కేంద్రాన్ని సందర్శించాలని కంపెనీ తెలపడం జరిగింది.

ఇక ఇండియా మార్కెట్లో Bajaj Pulsar మోడళ్లు మంచి ప్రజాదరణ పొందినవి. అలాగే యువతను పల్సర్ బైక్స్ ఎక్కువగా ఆకర్షించేవి. ప్రస్తుతం ఈ Pulsar సిరీస్ లో కంపెనీ 125 సిసి మొదలుకొని 220 సిసి వరకు వివిధ వెర్షన్లను అమ్ముతుంది.అలాగే దేశంలో పండుగ సీజన్ వస్తున్న ఈ నేపథ్యంలో, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ ఇప్పుడు సిద్ధమవుతోంది.ఇక ఇందులో భాగంగానే, Bajaj Pulsar NS160 ఇంకా Bajaj Pulsar 150 SD మోడళ్లపై కంపెనీ రూ. 4,000 నగదు ప్రయోజనాన్ని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో Pulsar NS160 ధర వచ్చేసి రూ. 1,15,091 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ బైక్ మెటాలిక్ పెరల్ వైట్, బెండ్ రెడ్ ఇంకా అలాగే ప్యూర్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో మనకు లభిస్తుంది.ఇక Bajaj Pulsar NS160 బైక్‌లో 160 సిసి 4 వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ అనేది ఉంటుంది. ఇగ్నిషన్ సులువుగా జరిగేందుకు ఈ బైక్ లో రెండు స్పార్క్ ప్లగ్‌ లు అనేవి కూడా ఉంటాయి. ఇక ఈ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఎక్కువగా 9000 ఆర్‌పిఎమ్ వద్ద 17.2 బిహెచ్‌పి పవర్ ను ఇంకా 7250 ఆర్‌పిఎమ్ వద్ద 14.6 న్యూటన్ మీటర్ టార్క్‌ ను కూడా ఉత్పత్తి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: