రిలీజ్ కి రెడీగా వున్న టీవీఎస్ అపాచి ఆర్ ఆర్ 310.. ఎప్పుడంటే?

Purushottham Vinay
ప్రముఖ బైక్ కంపెనీ అయిన టీవీఎస్ మోటార్ కంపెనీ  టీవీఎస్ అపాచి బైకులకు ఇండియా మార్కెట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కారణంగానే కంపెనీ తన ఫోర్డ్ ఫోలియోను మరింత విస్తరించడానికి ఇండియా మార్కెట్లో కొత్త బైకులను విడుదల చేయడానికి తగిన సన్నాహాలను రెడీ చేస్తోంది. ఇక ఇందులో భాగంగానే టీవీఎస్ కంపెనీ తన అపాచి RR 310 వెర్షన్ బైక్ విడుదల చేయడానికి ఇప్పుడు సిద్ధమవుతోంది.టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవల అందించిన సమాచారం ప్రకారం, 2021 టీవీఎస్ అపాచి RR 310 బైక్ ఇండియా మార్కెట్లో 2021 ఆగష్టు 30 వ తేదీన  అధికారికంగా విడుదల చేయబడుతుంది. ఇక ఈ బైక్ అధునాతన ఫీచర్స్ ఇంకా మంచి పరికరాలను కలిగి ఉంటుంది. ఇక ఈ కారణంగా ఇది చూడటానికి ఎంతో స్టైలిష్ గా ఉంటుంది.ఇక సాధారణంగా ఈ కొత్త టీవీఎస్ అపాచి RR 310 బైక్ ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రారంభించడానికి రెడీ అయ్యింది.

కానీ దేశంలో అధికంగా వ్యాపించిన కరోనా మహమ్మారి కారణంగా టీవీఎస్ అపాచి RR 310 బైక్ లాంచ్ వాయిదా పడటం జరిగింది. అయితే కరోనా మహమ్మారి ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టడం వల్ల ఈ బైక్ ఇప్పుడు విడుదలకు రెడీ అవుతుంది.ఇక ఈ కొత్త 2021 టీవీఎస్ అపాచి RR 310 బైక్ అనేక అప్డేట్స్ కలిగి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ స్టైలిష్ బైక్ చాలావరకు కూడా స్థానికంగా తయారైన పరికరాలను వినియోగించుకుంటుంది. ఇక ఇందులో టైర్లు అలాగే అడ్జస్టబుల్ ఫోర్కులు వంటి వాటితోపాటు ఇతర పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి.ఇక కంపెనీ విడుదల చేసిన కొంత సమాచారం ప్రకారం ఈ కొత్త బైక్ కి మిచెలిన్ రోడ్ 5 టైర్లు ఉపయోగించబడ్డాయి. అందువల్ల ఈ బైక్ నిర్వహణ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ బైక్ టైర్లు కూడా మెరుగైన పట్టును అందిస్తాయి.అందువల్ల రైడర్ కి మంచి రైడింగ్ అనుభవాన్ని ఈ బైక్ అందిస్తుంది.ఇక ఈ బైక్ ధర విషయానికి వస్తే.. ఇండియా మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అపాచి RR 310 రూ. 2.54 లక్షల ధరతో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) సేల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: