పెరిగిన మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలు..

Purushottham Vinay
ఇక భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా మార్కెట్లో విక్రయిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ధరలను కంపెనీ మరోసారి పెంచడం జరిగింది. పెరిగిన ఇన్పుట్ ఖర్చుల కారణంగా ఈ స్విఫ్ట్ కార్ మోడల్ ధరను పెంచుతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించడం జరిగింది.ఇక దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ కూడా ఒకటనే చెప్పాలి. ఇక కొద్ది రోజుల క్రితమే, మారుతి సుజుకి తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచిన సంగతి అందరికి తెలిసినదే. ఇక వీటిలో కొత్త స్విఫ్ట్ ఇంకా మారుతి సుజుకి యొక్క సిఎన్‌జి శ్రేణిలోని అన్ని మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.ఇక కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలు అనేవి రూ.1,000 నుండి రూ.15,000 వరకూ పెరిగడం జరిగింది.
స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏఎమ్‌టి వేరియంట్ ధర చూసుకున్నట్లయితే కనిష్టంగా రూ.1,000 మేర పెరగగా, స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర వచ్చేసి రూ.8,000 మేర పెరిగడం జరిగింది.ఇక స్విఫ్ట్ విఎక్స్ఐ, విఎక్స్ఐ ఏఎమ్‌టి, జెడ్‌ఎక్ఐ, జెడ్‌ఎక్స్ఐ ఏఎమ్‌టి ఇంకా జెడ్‌ఎక్ఐ ప్లస్ అలాగే జెడ్‌సి ప్లస్ డ్యూయల్ టోన్ ఇంకా జెడ్‌ఎక్స్ఐ ప్లస్ ఏఎమ్‌టి వేరియంట్ల ధరలు వచ్చేసి గరిష్టంగా రూ.15,000 మేర పెరిగడం జరిగింది. అలాగే ఆ పెరిగిన ధరలు అనేవి తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపడం జరిగింది.ఇక మారుతి సుజుకి స్విఫ్ట్ దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి మాత్రమే కాదు, దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో కూడా ఒకటి. మారుతి సుజుకి స్విఫ్ట్ ఇండియాలో లభిస్తున్న చిన్న కార్లలో ఒక మంచి ఫన్ టూ డ్రైవ్ కార్ అని చెప్పాలి. ఇక దీని తక్కువ నిర్వహణ వ్యయం కారణంగా, ఇది మంచి ప్రజాదరణను కలిగి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: