జావా బైక్ లవర్స్ కి షాక్.. పెరిగిన ధరలు..

Purushottham Vinay
రెట్రో-మోడ్రన్ మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ జావా మోటార్‌సైకిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాయల్టీగా ఇంకా లగ్జరీగా కస్టమర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇండియా మార్కెట్లో అమ్ముతున్న తమ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు జావా కంపెనీ ప్రకటించడం జరిగింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ ఇంకా వేరియంట్‌ను బట్టి ఈ జావా బైక్‌ల ధరలు ఒకేసారి రూ.8,700 వరకూ పెరిగాయి.ఇక దేశీయ విపణిలో ఇప్పటికే ధరలను పెంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంకా హీరో మోటోకార్ప్ అలాగే సుజుకి మోటార్‌సైకిల్స్ ఇంకా కెటిఎమ్ కంపెనీల లాగానే జావా మోటార్‌సైకిల్స్ కూడా ఈ జులై నెలలో తమ వాహనాల ధరలను పెంచడం జరిగింది.
జావా మోటార్‌ బైక్స్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత ఖరీదైన బైక్ ఏదంటే అదే జావా పెరాక్. జావా కంపెనీ ఈ బైక్ ధరను సుమారు రూ.8,700 మేర పెంచడం జరిగింది. ఇక తాజా ధరల పెరుగుదల తరువాత మార్కెట్లో జావా పెరాక్ మోటార్‌సైకిల్ ధర ఇప్పుడు రూ.1.97 లక్షల నుండి 2.06 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరిగడం జరిగింది.ఇక అందరూ బాగా ఇష్టపడే జావా 42 బైక్ ధర కూడా భారీగానే పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే జావా మోటార్‌ బైక్స్ ఈ మోడల్‌లో అల్లాయ్ వీల్స్‌తో కూడిన వేరియంట్లను మార్కెట్లో విడుదల చేయడం జరిగింది.ఇప్పుడు ఈ జావా 42 అల్లాయ్ వీల్ వేరియంట్‌లో ధర రూ.7,000 వరకు పెరిగడం జరిగింది.ఇక తాజా ధరల పెరుగుదల తరువాత, జావా 42 డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ వేరియంట్ ప్రస్తుత ధర రూ.1.91 లక్షలకు చేరుకోవడం జరిగింది.ఇక గడచిన ఫిబ్రవరిలో కంపెనీ ఈ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసినప్పుడు దీని ధర వచ్చేసి అప్పుడు రూ.1.84 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది.ఇక ఇవే కాకుండా జావా 42 స్పోక్ వీల్ ఇంకా జావా స్టాండర్డ్ మోడల్స్ వంటి ఇతర జావా మోటార్‌ బైక్స్ ధరలను కూడా రూ.1,000 వరకూ పెంచడం జరిగింది. ఇక ఈ రెండు బైక్‌లు కూడా జావా 42 అల్లాయ్ వీల్స్ వేరియంట్ లాగానే ఎంతో అప్‌డేటెడ్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: