ఆకట్టుకుంటున్న టీవీఎస్ ఐక్యూబ్ ఇ-బైక్... వివరాలు..

Purushottham Vinay
ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూణే సిటీలో విడుదల చేసింది. పూణే సిటీలో విడుదలైన ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర వచ్చేసి రూ. 1.10 లక్షలు (ఆన్-రోడ్). ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ కోసం కస్టమర్లు ఆన్‌లైన్‌లో బ్రాండ్ వెబ్‌సైట్‌లో 5 వేల రూపాయలు చెల్లించి ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్స్ డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.ఇక టీవీఎస్ కంపెనీ ఈ స్కూటర్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్స్ ను కూడా అందిస్తోంది.దాని ప్రకారం మొదట కేవలం రూ. 25 వేల రూపాయలు చెల్లించి నెలకు 2,468 రూపాయల ఈఎమ్ఐ కింద 48 నెలల సమయంలో పూర్తిగా చెల్లించుకునే వెసులు బాటు వుంది.టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ బైక్ లో 4.4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పాటు 3 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు కూడా ఉన్నాయి.

ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్ ఒకే ఛార్జ్ (ఎకో మోడ్) పై ఎక్కువగా 75 కి.మీ పరిధిని అందిస్తుంది.ఇక దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి గంటకు 80 కి.మీ వరకు ఉంటుంది.ఇక ఈ ఐక్యూబ్ ఇ బైక్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 40 కిమీ వరకు స్పీడ్ గా వెళుతుంది.ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ ని కేవలం నాలుగు గంటల్లోనే 0 నుంచి 75 వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి మొత్తం 5 గంటల సమయం పడుతుంది.ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉండటమే కాకూండా నడిపేవారికి ఈ ఎలక్ట్రిక్ చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.ఇక ఐక్యూబ్ ఎలక్ట్రిక్ బైక్ స్మార్ట్ కనెక్ట్ ప్లాట్‌ఫాం, అడ్వాన్స్‌డ్ టిఎఫ్‌టి క్లస్టర్ ఇంకా టివిఎస్ ఐక్యూబ్ యాప్ కలిగి ఉంటుంది. అలాగే ఈ యాప్ లో జియో-ఫెన్సింగ్, రిమోట్ బ్యాటరీ ఛార్జ్ స్టేటస్, నావిగేషన్ అసిస్ట్, లాస్ట్ పార్క్ ప్లేస్, కాల్, ఎస్ఎమ్ఎస్ వార్ణింగ్ వంటి సూపర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: