చీప్ అండ్ బెస్ట్ డ్యుకాటి టూ వీలర్ ఇదే..

Purushottham Vinay
ఇటాలియన్ సూపర్‌బైక్ కంపెనీ డ్యుకాటి మళ్ళీ తమ ఉత్పత్తిని శ్రేణిని విస్తరించడం కోసం ఇంకా కొత్త మార్కెట్లను చేరుకోవాలనే లక్ష్యంతో ఓ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను ప్రవేశపెట్టింది. డ్యుకాటి ప్రో-ఐ ఇవో పేరుతో ఓ ఎలక్ట్రిక్ బైక్ ను కంపెనీ ఆఫీషియల్ గా ఆవిష్కరించడం జరిగింది.డ్యుకాటి ప్రో-ఐ ఇవో ఎలక్ట్రిక్ బైక్ 350W మోటార్ ఇంకా 280Wh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ పూర్తి ఛార్జీపై గరిష్టంగా 30 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపడం జరిగింది. ఇక హ్యాండిల్‌బార్‌లో లోగో మినహా డిజైన్ పరంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడటానికి షియోమి కంపెనీ ఎమ్365 ఎలక్ట్రిక్ బైక్ లాగానే కనిపిస్తుంది.డ్యుకాటి ప్రో-ఐ ఇవో ఎలక్ట్రిక్ బైక్ ఫోల్డబిల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాదు, దీని వైట్ కూడా కేవలం 12 కిలోలు మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఈ ఎలక్ట్రిక్ బైక్ ను చాలా ఈజీగా మడతపెట్టి, ఎక్కడికైనా తీసుకువెళ్లగలిగేలా డిజైన్ చేశారు.
ఈ ఎలక్ట్రిక్ బైక్ కాంపాక్ట్ డిజైన్ కారణంగా ఇది ఎక్కువ స్టోరేజ్ స్థలాన్ని కూడా ఆక్యుపై చెయ్యదట.సెగ్వే-నైన్‌బోట్ అందిస్తున్న ప్రొడక్ట్స్ లాగానే డ్యుకాటి ప్రో-ఐ ఇవో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అదే రకమైన డిజైన్ ఇంకా పనితీరును కలిగి ఉంటుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎక్కువగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.అందుకే ఈ డ్యుకాటి ఎలక్ట్రిక్ బైక్ ను నడపటానికి లైసెన్స్, రిజిస్ట్రేషన్ లాంటివేమి అవసరం ఉండదు.ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ లైట్-వెయిట్ ఈ బైక్ ఏకంగా 100 కిలోల వరకు బరువును మోయగలదు.అందుకే , ఇది పిల్లలకు ఇంకా యువతకు చాలా అనుకూలంగా అలాగే ఫన్-టూ-రైడ్ టూవీలర్ లాగా ఉంటుంది.ఇక ధర విషయానికి వస్తే...ఇది మనదేశ కరెన్సీలో సుమారు 36,000 రూపాయలుగా ఉంటుందట.ఇక చీప్ అండ్ బెస్ట్  టూ వీలర్ లో బెస్ట్ ఆప్షన్ ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: