హోండా సంచలన నిర్ణయం.. ఇకమీదట అన్నీ అలానే..

Satvika
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హోండా తాజాగా సంచలన ప్రకటన చేశారు.జపాన్ కార్ల తయారీ సంస్థ 'హోండా కార్స్' ఇకనుంచి పూర్తిగా విద్యుత్ కార్ల తయారీ వైపు మళ్లనున్నది. భూతాప నివారణ కోసం పెట్రోల్ లేదా డీజిల్ లేదా గ్యాస్ కార్ల ఉత్పత్తికి స్వస్తి పలుకనున్నది.ఉత్తమ విద్యుత్ కార్లను తయారు చేయడానికి హోండా కార్స్ కార్యాచరణ ప్రారంభించింది. ఇటీవలే ప్రొటోటైఫ్ మోడల్ భవిష్యత్ ఎలక్ట్రిక్ కారు ఎస్‌యూవీ ఈ ని ఆవిష్కరించింది.

సరిగ్గా మరో 19 ఏండ్లకు పెట్రోల్, డీజల్ ఆధారిత కార్ల తయారీకి ఫుల్ స్టాప్ పెట్టనున్నది. ఇందుకోసం కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.2040 నుంచి పూర్తిగా విద్యుత్ కార్లను హోండా కార్స్ ఉత్పత్తి చేయనున్నది. ఈ నిర్ణయం పర్యావరణ పరంగా ఎంతో ప్రయోజనకారి కానున్నది. ఈ లక్ష్య సాధన దిశగా సంస్థ తీవ్రంగా కసరత్తు ను ప్రారంభించింది. 2030 నాటికి తొలుత బ్యాటరీ అండ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ 40 శాతం వరకు మార్కెట్లోకి తేవాలని సంకల్పించింది

ఇకపోతే హోండా కార్స్. 2035 నాటికి 80 శాతం.. 2040 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందుబాటు లోకి తీసుకొ చ్చే యోచన లో ఉన్నారు. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ విద్యుత్ వాహనాలకు సంబంధించి చార్జింగ్ మౌలిక వసతుల కల్పన పై కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఇందుకు అవకాశాలెలా ఉంటాయన్నదని మున్ముందు తెలియనున్నది. హోండా తీసుకొస్తున్న కొత్త కార్లు జనాలను తప్పక ఆకట్టూంటాయని కంపెనీ వెల్లడించింది..

ఇటీవల హోండా కార్స్ ఆవిష్కరించిన ఎస్‌యూవీ ఈ ప్రొటోటైప్ ఎలక్ట్రిక్ కారు, దాని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ కారుకు కంపెనీ లోగోతోపాటు ముందు పెద్ద డీఆర్ఎల్ స్ట్రిప్ రానున్నది. పొడవైన అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి. డిజైన్ అలాగే ఉన్నా పలు మార్పులు, మరింత ఆకర్షణీంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి హోండా ప్రయత్నం ఎంతవరకు వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: