బజాజ్ బైక్.. లీటర్ కు 90 కిలోమీటర్ల మైలేజ్.. ధర?

Satvika
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఎప్పటికప్పుడు యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.. ఈ కంపెనీ నుంచి విడుదల అయిన వాహనాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. తాజాగా మరో బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.బజాజ్ సిటి 110 X బైక్లో దాని స్టాండర్డ్ వేరియంట్ కంటే ఎక్కువ అప్డేటెడ్ ఫీచర్లను అందించింది. సీటీ సిరీస్లో ఇది టాప్ ఎండ్ వేరియంట్. దీనిలో 115 సీసీ డీటీఎస్ ఐ ఇంజిన్, 7 కేజీల వరకూ బరువు మోయగలిగే క్యారియర్ను అమర్చింది. ఈ కొత్త బైక్ ఆకట్టుకునే డిజైన్, కాస్మెటిక్ అప్గ్రేడ్స్తో రూపొందించబడింది. 


 ఇకపోతే వైడ్ క్రాస్ సెక్షన్, రౌండ్ హెడ్ లైట్, ఆల్ బ్లాక్ విజర్ వంటి ఫీచర్లను కూడా జోడించింది. కస్టమర్ల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని పాత వేరియంట్కు అనేక మార్పులు చేసి ఈ సరికొత్త బైక్ను విడుదల చేసింది.వీటితో పాటు, ఈ బైక్లో సెమీ- నాబీ టైర్స్, స్క్వేర్ ట్యూబ్, సెమీ -డబుల్ క్రాడిల్ ఫ్రేమ్, ఇంటిగ్రేటెడ్ ట్యాంక్ పాడ్స్ వంటి ఫీచర్లను కూడా చేర్చింది. తద్వారా, గతుకుల రోడ్లపై కూడా సులభతరంగా ప్రయాణించవచ్చు. కఠినమైన రహదారి పాచెస్ను సులభంగా నిర్వహించడానికి ఈ మోటార్సైకిల్ను సెమీ నైన్బై ఎంఆర్ఎఫ్ టైర్లతో తయారు చేశారు. 


ఈ బైక్ వేరియంట్ లలో 115 సిసి డిటిఎస్-ఐ ఇంజిన్‌ను కూడా అందించారు. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.48 బిహెచ్‌పి, 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.81 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలోని ఇంజిన్ 4 -స్పీడ్ గేర్‌బాక్స్‌కు జత చేసి ఉంటుంది. ఇంజిన్ సెటప్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ ఇంజిన్ గార్డ్, క్రాష్ గార్డ్ మాట్టే గ్రే కలర్స్లో లభిస్తుంది.. ముఖ్యంగా ఈ బైక్ హైలెట్ అయిన విషయం ఏంటంటే మైలేజ్.. ఒక లీటర్కు 90 కిలో మీటర్ల మైలేజ్ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇన్ని అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఈ బైక్ ధర రూ. 55,494 గా కంపెనీ నిర్ణయించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: