దూసుకెళ్తున్న టాటా సఫారీ కారు.. బెస్ట్ ఇదే...!!

Satvika
ఆటో మొబైల్స్ కంపెనీలు కొత్త వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. రోజుకో కంపెనీ అదిరిపోయే ఫీచర్ తో మార్కెట్ లోకి వాహనాలను విడుదల చేసి ప్రజల మెప్పును పొందుతున్నాయి. ఇప్పుడు టాటా కార్స్ మార్కెట్ ను ఊపెస్తున్నాయి.సఫారీ భారత్ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్ యు వి లలో ఒకటి.. దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది కస్టమర్ల మన్ననలు పొందింది.. టాటా మోటార్స్ తమ కొత్త ఫ్లాగ్షిప్ సెవెన్ సీటర్ ఎస్ యువి ఐకానిక్ సఫారీ భారత్ మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది..



ఈ ఏడాదికి ప్రత్యేకంగా ఉన్న ఆ కారు టాటా సఫారీ బ్రాండ్ సరికొత్త ఇంపాక్ట్ 2.0 డిజైన్ కలిగి ఉంది. ఈ కొత్త సఫారీ ఎస్యువి దాని పాత తరాలకు నివాళిగా చెప్పుకోవచ్చు. కొత్త టాటా సఫారీ కనెక్టెడ్ టెక్నాలజీతో వస్తుంది. సెవెన్ సీటర్ సఫారీ ఇప్పుడు డాష్ బోర్డ్ చుట్టూ ఒక చుట్టూ సాఫ్ట్ టచ్ మెటీరియల్ ను కలిగి ఉంది .2.0 లీటర్ టేక్ డీజిల్ ఇంజన్తో దూసుకెళ్తోంది. లేటెస్ట్ వెర్షన్ 168 బి హెచ్ పి శక్తిని 380 ఎన్ ఎం పిక్ టాక్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఎంపీక లతో జతచేశారు.



 ఈ కార్ లో ఎకో, సిటీ ,స్పోర్ట్స్ మోడ్ లు ఉన్నాయి. భారతదేశంలో ఒకసారి ప్రవేశపెట్టిన టాటా సఫారీ 6 వేరియంట్స్ లో లభిస్తుంది. ఇవి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికల తో అందిస్తారు. మిగతా 3 వేరియంట్లు మాన్యువల్ గేర్ బాక్స్ తో జతచేశారు. ఈ కార్ మూడు కలర్ ఆప్షన్ల తో లభిస్తుంది . ఇంకా దీని ధర నిర్ణయించలేదు. ఇది హుండాయ్ కెట్రా, జీప్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది...ఈ కార్లు ఇప్పుడు మార్కెట్ ను షేక్ చేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: