ఏప్రిల్లా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 స్కూటర్ బుకింగ్స్‌ ప్రారంభం.. ఎలా కొనుగోలు చేయాలంటే..??

Satvika
మార్కెట్ లో కార్ల కన్నా కూడా స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది.. అయితే వాహనదారుల అభిరుచుల మేరకు కొన్ని కంపెనీలు కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు మరో కంపెనీ స్కూటర్ ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఆ స్కూటర్ కొనుగోలు పై సేల్ ప్రారంభం అయింది.పియోజియా నుంచి కొత్త స్కూటర్లు మార్కెట్ లో లాంఛ్ అయ్యాయి.ఇప్పటి వరకు వచ్చిన ఈ కంపెనీ నుంచి స్కూటర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. మరో స్కూటర్ ను లాంఛ్ చెయ్యనున్నారు. ఆ స్కూటర్ పూర్తి వివరాలు గురించి తెలుసుకుందాం..

పియాజియో ఇండియా నుంచి త్వరలో రాబోతున్న 160 సీసీ స్కూటర్‌ ఏప్రిల్లా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం భారామతీ ప్లాంట్‌లో ఈ స్కూటర్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఈ క్రమంలో ప్రీ లాంచ్‌ బుకింగ్స్‌ను పియాజియో ప్రారంభించింది. రూ.5వేలు చెల్లించి స్కూటర్‌ను ప్రీబుక్‌ చేసుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.. ఈ స్కూటర్ పీచర్లు వాహనదారులను ఆకట్టుకుంటుంది. మార్కెట్ లోకి రాక ముందే ఈ స్కూటర్ క్రేజ్ పెరిగింది. బుకింగ్ కొరకు కష్టమర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

మరో విషయమేంటంటే..బీఎస్‌-6 ఇంజిన్‌తో వస్తున్న ఈ స్కూటర్‌లో మొబైల్‌ కనెక్టివిటీ ఆప్షన్‌, పొడవాటి అతిపెద్ద సీట్‌, అడ్జస్టబుల్‌ రియర్‌ సస్పెన్షన్‌, డిస్క్‌బ్రేక్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఏడాది అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ముందుగా వాగ్దానం చేసినట్టుగా వీలైనంత తొందర్లో ఏప్రిల్లా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160ని తీసుకురాబోతున్నామని పియాజియో ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డియిగో గ్రఫ్ఫీ తెలిపారు.ఇందులోని కొత్తతరం డిజైన్‌, టెక్నాలజీ, అత్యున్నత సదుపాయాలు ఏప్రిల్లా ఫాలోవర్లకు కొత్త అనుభూతినిస్తుందని చెప్పారు. ధర, విడుదల వంటి వివరాలు పేర్కొనలేదు. ఏప్రిల్లా ఇండియా వెబ్‌సైట్‌లో ప్రస్తుతం బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.. అయితే ఈ బైక్ కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.. ఏది ఏమైనా కూడా విడుదలకు ముందే మంచి టాక్ ను అందుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: