మార్కెట్లోకి త్వరలో ఇన్నోవా కొత్త మోడల్.. ధర ఎంతో తెలుసా..?
అయితే ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ మార్పులుకొత్త ఇన్నోవా లోపలి భాగం ఇప్పటికే ఉన్న మోడల్‌తో సమానంగా ఉంటుందని తెలిపారు. అయితే ఇది యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, టిఎఫ్టి స్క్రీన్ వంటి కొన్ని కొత్త ఫీచర్లను ఇచ్చిందన్నారు. అయితే, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇంజిన్ లో మార్పులు చేసే అవకాశం చాలా తక్కువ అని నిపుణులు తెలిపారు.
ఇక ఈ కారును 2.4 లీటర్ డీజిల్, 2.7 లీటర్లతో కంపెనీ తీసుకురానుందని తెలిపారు. పెట్రోల్‌కు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుందని తెలిపారు. డీజిల్‌కు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుందన్నారు. ఇక ఇటీవల, టయోటా ఇన్నోవా క్రిస్టా యొక్క సిఎన్జి వేరియంట్లు పరీక్ష సమయంలో గుర్తించబడ్డాయి. గ్యాసోలిన్ మరియు డీజిల్ తరువాత, సంస్థ ఇప్పుడు దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఎమ్‌పివిని సిఎన్‌జిలోకి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోందని తెలిపారు.
అంతేకాకుండా భారతదేశంలో, కొత్త ఇన్నోవా క్రిస్టా 2021 లో విక్రయించబడుతుందని ఆలోచిస్తున్నారు. ఇది కాకుండా, అప్డేట్ చేసిన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని కూడా వచ్చే ఏడాది నాటికి వస్తుందని కంపెనీ ప్రతినిధులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ కారు ధర కూడా రూ. 15.66 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా నిపుణులు వేస్తున్నారు.