ఈ సైకిల్ కి భారీ డిమాండ్.. ధర ఎంతో తెలుసా..?
కరోనా మహమ్మారి అనంతర కాలంలో భారతదేశంలో సైకిళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా లాక్ డౌన్ కాలంలో జిమ్‌లు ఫిట్‌నెస్ కేంద్రాలు మూసివేత కారణంతగా వినియోగదారులు ఫిట్‌గా ఉండటానికి సైక్లింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా సైకిళ్ల డిమాండ్ 70 శాతానికి పైగా పుంజుకుంది. మరీ ముఖ్యంగా ప్రీమియం సైకిళ్లకు డిమాండ్ దాదాపు 100 శాతం పెరిగినట్టు అంచనా. దీంతో ప్రీమియం సైకిల్ తయారీదారులు ఈ డిమాండ్ క్యాష్ చేసుకోవడంపై దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలోనే స్కాట్ ఈ ఖరీదైన సైకిల్‌ను ఆవిష్కరించింది.
అయితే ఫిట్‌నెస్ లక్ష్యంగా ఉన్న వినియోగాదారులకు తమ ప్రొడక్ట్స్ ను పరిచయం చేసేందుకు ఇదే మంచి సమయంగా స్కాట్ సంస్థ భావిస్తోందన్నారు. గత కొన్ని నెలలుగా ప్రీమియం సైకిళ్లలో భారీ డిమాండ్‌ను గమనించామనీ తెలిపారు. మన్నిక, సాంకేతికత, అధిక-నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందని స్కాట్ స్పోర్ట్స్ ఇండియా కంట్రీ మేనేజర్ జేమిన్ షా తెలియజేశారు. 5 లక్షల నుండి 6 లక్షల విలువ చేసే స్కాట్ అడిక్ట్ సిరీస్ సైకిళ్లకు చాలా ఆర్డర్‌లను అందుకున్నామన్నారు. రాబోయే కొద్ది నెలల్లో మరిన్ని సైకిళ్లను లాంచ్ చేయనున్నామని తెలిపారు.
ట్విన్ లాక్ సస్పెన్షన్ సిస్టమ్, 12 స్పీడ్ ఈగిల్ డ్రైవ్‌ట్రెయిన్, షిమనో ఎస్ఎల్ఎక్స్ డిస్క్ బ్రేక్‌లు, మాక్సిక్ రెకాన్ రేస్ కేవ్లర్ టైర్స్ సింక్రోస్ పార్ట్స్ ఇందులో ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయని అన్నారు. డీలర్ నెట్‌వర్క్‌తో పాటు స్పోర్ట్స్ నెట్ వర్క్.ఇన్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. నిపుణులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు 91 8080754321 కస్టమర్ కేర్ నెంబరును కూడా ఈ బ్రాండ్ అందిస్తోందన్నారు.