అతి త్వరలో రాబోతున్న మహీంద్రా మోజో 300...!

Kothuru Ram Kumar

రోజుకో కొత్త బైక్ భారత మార్కెట్లో విడుదల అవుతున్నాయి. ఏప్రిల్ 1 నుండి భారతదేశ ప్రభుత్వ నిబంధనల ప్రకారం బిఎస్ 4 వాహనాలను అమ్మకం ఆపివేసి, కేవలం బీఎస్ 6 వాహనాలు మాత్రమే అమ్మాలని చర్యలు తీసుకుంది. దీని ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో ప్రతి ఆటోమొబైల్ రంగ సంస్థ బీఎస్ 6 వాహనాలను తయారు చేసి వినియోగదారులకు అందజేస్తోంది. ఇక తాజాగా మహీంద్రా టూవీలర్స్ నుండి కొత్తగా మహేంద్ర మోజో 300 బైక్ ను మార్కెట్లోకి తీసుకు రాబోతోంది. ఈ బైక్ కూడా బీఎస్ 6 ప్రమాణాలకు తగ్గట్టుగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ బైక్ కావాలనుకునే వారు కేవలం రూ. 5 వేలు మాత్రమే చెల్లించి ఫ్రీ బుకింగ్ చేసుకోవచ్చు.

 

 


ఇకపోతే ఈ బైక్ కు సంబంధించిన ధర ఎంతన్న విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇదివరకు బిఎస్ 4 మోడల్ చూస్తే షోరూమ్ లో రూ. 1.49 లక్షలు గా ఉండేది. ఇప్పుడు బిఎస్ 6 మోడల్ ధర ఎంత పెంచుతారో చూడాలి మరి. కొత్తగా రాబోయే బైకులు 285 సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్ విత్ లిక్విడ్ కూలింగ్ లాంటి కొన్ని ప్రత్యేకతలను ఈ బైకు లో చేర్చడం జరిగింది.

 

కస్టమర్లు మహీంద్రా మోజో 300 బైక్ ను మొత్తం నాలుగు కలర్స్ లో పొందవచ్చు. రూబీ రేట్, బ్లాక్ పెరల్, రెడ్ అగెట్, గార్నెట్ బ్లాక్ రంగులలో మనకు ఈ బైక్ లభించబోతోంది. వచ్చే నెలలో విడుదల కాబోయే ఈ బైకు ఫ్రీ బుకింగ్ ని ఇప్పటికే మహీంద్రా టూవీలర్స్ పొందడానికి కేవలం రూ. 5,000 చెల్లించడంతో బైక్ ను సొంతం చేసుకోవచ్చు. పాత మోడల్ తో పోలిస్తే ఈ బైక్ ధర రూ. 10 వేలకు పైనే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: