హ్యుండై మోటార్స్ నుండి సక్సెస్ ఫుల్ వెహికల్ గా వచ్చిన శాంట్రో ఇప్పుడు సరికొత్త హంగులతో మార్కెట్ లోకి వచ్చింది. హ్యుండై వెహికల్స్ లో శాంట్రోకి మంచి డిమాండ్ ఉంది. అయితే కొత్త మోడల్ రిలీజ్ చేసి ఏడాది అవుతున్న సందర్భంగా హ్యుండై యానివర్సరీ ఎడిషన్ అంటూ మరో కొత్త వేరియెంట్ రిలీజ్ చేయడం విశేషం.
ఈ వెహికల్ కూడా సేమ్ టూ సేమ్ కొత్త హ్యుండై శాంట్రో మోడల్ లానే ఉన్నా దీనిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వెహికల్ ఆటోమెటిక్, మ్యాన్యువల్ గేర్ లతో వస్తుంది. మ్యానువల్ వర్షన్ 5.12 లక్షలు కాగా ఆటోమెటిక్ వర్షన్ 5.75 లక్షలు నిర్ణయించారు. హ్యుండై శాంట్రో స్పోర్ట్స్ వేరియెంట్ ఆధారంగా ఈ యానివర్సరీ ఎడిషన్ లాంచ్ చేశారు.
ఈ సరికొత్త హ్యుండై శాంట్రో యానివర్సరీ ఎడిషన్ లో రెండు కలర్స్ తో వస్తుంది. పోలార్ వైట్ కలర్ తో ఒకటి వస్తుండగా.. ఆక్వా టీల్ కలర్ తో మరో వెహికల్ వస్తుంది. ఇక ఇంజిం విషయానికి వస్తే 1.1 లీటర్ కెపాసిటీ కలిగిన నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో 68 బి.హెచ్.పి పవర్, 99 ఎన్.ఎం టార్క్ తో ఈ వెహికల్ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం శాంట్రో కొనాలనుకునే వారు ఈ సరికొత్త యానివర్సరీ ఎడిషన్ అనుభూతి చూడండి.