టాటా కార్ల రేట్లు పెరిగాయి..!

shami
భారత్ లో దిగ్గజ ప్యాసెంజర్ కార్ల తయారీ సంస్థ టాటా తమ కార్లన్నిటికి రేటు పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రతి కారు మీద 2.2 శాతం ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది టాటా మోటార్స్. 2018లోనే టాటా మోటార్స్ రేటు పెంచడం ఇది మూడవసారి అని తెలుస్తుంది. ఇన్వెస్ట్ మెంట్ కాస్ట్ ఎక్కువవుతున్న సందర్భంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే కార్ల రేటు పెంచుతున్నట్టు ప్రకటించారు.


జనవరి నెలలో 25,00 రూ, ఏప్రిల్ లో 60,000 రూ, జూలైలో 35,000 రూ.లు పెంచుతూ వస్తుంది టాటా మోటార్స్. అయితే ఆగష్టు నుండి కొత్త ధరలు అమలులో ఉండనున్నాయి. గడిచిన 28 నెలల్లోనే 52 శాతం వృద్ధి పెంచుకున్న టాటా మోటార్స్ కస్టమర్స్ కు ఎంతో ప్రయోజనకరమైన ఉత్పత్తులను అందచేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


ప్యాసింజర్ కార్లలో కాస్త గడ్డు కాలం నుండి బయట పడిన టాటా మోటార్స్ నుండి వచ్చిన నెక్సాన్, హెక్సా, టియాగో, టిగోర్ కార్లు సేల్స్ పెరగడంతో టాటా మళ్లీ ఫాంలోకి వచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: