ప్రేమలో విఫలం అయిన నటి 'పూర్ణ'... ఎవరో తెలుసా?

VAMSI
సీమ టపాకాయ్ చిత్రంలో తన అందాలతో ప్రేక్షకులను ఊర్రుతలూగుంచిన చిన్నది పూర్ణ. ఈ బూరె బుగ్గల అమ్మాయి ఆ తరవాత రూటు మార్చి అవును వంటి హారర్ చిత్రాలతో తన లోని మరో యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తరవాత కొన్ని చిత్రాలు కూడా ఇదే తరహాలో విభిన్న పాత్రలు పోషించి ఇండస్ట్రీ నుండి కాస్త గ్యాప్ తీసుకుంది. మళ్ళీ కొన్నాళ్ళకి రీ ఎంట్రీ ఇచ్చిన పూర్ణ అటు వెండి తెరపై ఇటు బుల్లి తెరపై రెండింట సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బుల్లి తెరపై ఢీ షో తో టీవి ప్రేక్షకులు బాగా దగ్గరైన పూర్ణ తన పాపులారిటీ ని బాగా పెంచుకుంది.
అయితే ఈ మధ్య ఢీ షో లో జడ్జి గా పూర్ణ ప్లేస్ కాస్త వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఇపుడు పూర్ణ శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ఇంద్రజకు బదులుగా జడ్జిగా చేస్తోంది. అయితే  ఇటీవల ఈ షో లో చేసిన ఒక స్కిట్ చూసి ఫుల్  ఎమోషనల్ అయ్యారు పూర్ణ. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో నూకరాజు, శాంతికుమార్ కలిసి చేసిన స్కిట్ చూసి అందరు ఎమోషనల్ అయ్యారు. కానీ పూర్ణ ఎందుకో గాని ఎప్పుడూ లేని విధంగా ఈ స్కిట్ కు బాగా కనెక్ట్ అయి చాలా ఎమోషనల్ అయ్యారు. నూకరాజు, శాంతికుమార్, ఆసియా కలిసి ఒక విషాద ప్రేమ కథను స్కిట్ గా చేసి చూపించగా, ఈ స్కిట్  చూసి పూర్ణ కూడా బాగా ఎమోషనల్ అయ్యి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి వైపు న్యాయం ఉందో అస్సలు చెప్పడం వీలు కాదు. కానీ  ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం కలిసి బతకాలన్నా కూడా అదృష్టం ఉండాలి అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు … అయితే ఆ సమయం లో పూర్ణ మాటల్లో చాలా అర్దం కనిపించింది తన జీవితంలో కూడా ప్రేమ విఫలం అయ్యిందేమో అన్న భావన వచ్చి అంతా ఆ విధంగా అనుకుంటున్నారు.  ఇందులో నిజమెంతుందో తెలియదు.. కానీ ప్రేమించిన వ్యక్తి తో జీవితం పంచుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప వరం అనే చెప్పాలి. కాగా ఈమె దుబాయ్ కు చెందిన ఒక వ్యాపార వేత్తను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: