కత్రినా విక్కీ పెళ్లివేదిక ఖరారు..!

frame కత్రినా విక్కీ పెళ్లివేదిక ఖరారు..!

MOHAN BABU
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా బీటన్ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం విక్కీ, కత్రిన వివాహం రాజస్థాన్ లోని సవాయి మాదవపూర్ జిల్లాలోని సిక్స్త్ సెన్సెస్ పోర్ట్ లో అంగరంగ వైభవంగా జరగనుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత? నిజమైతే పెళ్లి డేట్ ఎప్పుడు అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహ వేడుకలు డిసెంబర్ 7 నుంచి 12 తేదిల మధ్య జరగనుండగా ఇప్పటికే పెళ్లికి సంబంధించిన హోటల్ బుకింగ్ కూడా పూర్తయిందని కథనాలు వస్తున్నాయి. అంతేకాదు ఈ వీఐపీ వెడ్డింగ్ నిర్వహించడానికి చాలా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని మాదవ్ పూర్లోని వివిధ హోటళ్లలో రూమ్స్ బుక్ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. మరోవైపు కత్రినా,విక్కీ కౌశల్ ల టీం కూడా పెళ్లి కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. సిక్స్త్ సెన్సెస్ బర్వారా కోటలో పరిస్థితినీ సమీక్షించేందుకు పది మంది సభ్యుల బృందం మంగళవారం అక్కడికి చేరుకుందట. వివాహ వేడుకల్లో భాగంగా జరిగే మెహందీ ఫంక్షన్, సంగీత్ వంటివి ఎక్కడ నిర్వహించాలనే విషయాలను టీం పర్యవేక్షిస్తుందని జాతీయ మీడియా చెబుతోంది. అయితే పెళ్లి గురించి విక్కీ, కత్రినా తరఫునుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

 కాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్, యువ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ లో ఉందనే వార్తలు ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ తరచూ చెట్టాపట్టాలేసుకొని విదేశాల్లో తిరగడంతో పాటు, పలు ప్రైవేట్ పార్టీలలో కనిపించడం  ఈ వార్తలకు బలం చేకూరింది. అయినా సరే ఈ జంట తమ వ్యక్తిగత జీవితం,రిలేషన్ షిప్ కు సంబంధించిన విషయాలపై సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే విక్కీ, కత్రినా లకు దీపావళి రోజున రోకా ఫంక్షన్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. కత్రినా కైఫ్ కు ఎంతో ఆప్తులైన దర్శకుడు కబీర్ ఖాన్ నివాసంలో ఈ వేడుక నిర్వహించారని  బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. కత్రినా, విక్కీ కౌశల్ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు పాల్గొన్నారని, వివాహాలకు సంబంధించిన విషయాల  గురించి మాట్లాడుకున్నారని, ఇరు కుటుంబాలు పలు ఖరీదైన బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నారని ఆంగ్ల పత్రికల్లో వార్తలాచ్చాయి. ఇప్పుడు డిసెంబర్ లో రాజస్థాన్ లోని సిక్స్త్ సెన్సెస్ పోర్ట్ లో వీరి పెళ్లి జరగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లి వార్తలపై అధికారిక ప్రకటన చేయనుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: