సేవలలో రారాజు పునీత్..?

MOHAN BABU
బాలనటుడిగా ఇరవైకి పైగా సినిమాల్లో నటించిన రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పునీత్ రాజ్ కుమార్, కథానాయకుడిగా ఇరవై ఆరు సినిమాల్లో నటించాడు. పునీత్ నటించిన దాదాపు అన్ని సినిమాలకు కథానాయకుడి పేరు ప్రధానంగా ఉండడం గమనార్హం. పూరి జగన్నాథ్  దర్శకం వహించిన అప్పూ సినిమా తో ఆరంభమైన అభినయం కన్నడ చిత్రసీమలో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చింది. కన్నడ చిత్రసీమలో పవర్ స్టార్ గా కొనసాగుతూ  మరోవైపు తన ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక సేవ కోసం వినియోగిస్తూ పునీత్ రాజకుమార్ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. అప్పటి వరకూ తన తల్లి పార్వతమ్మ ఆధ్వర్యంలో కొనసాగిన మైసూరులోని శక్తి దామా కేంద్రం ద్వారా అభాగ్యులయిన మహిళలకు ఆశ్రయం లభించేది. పార్వతమ్మ మరణానంతరం ఆ బాధ్యతలను పునీత్ రాజకుమార్ చేతిలోకి తీసుకున్నారు.


ఇతర ప్రాంతాల్లో సాయం కోసం చేతులు చాచే అభాగ్యులకు అండగా నిలిచారు. ఆయన నేపథ్యగాయకుడిగా పొందే ఆదాయాన్ని  ఈ సేవల కోసం ప్రత్యేకించారు. తొలుత ఉచితంగా దానం చేయాలని భావించినా నిర్మాతల ఒత్తిడి కారణంగా  స్వీకరించవలసి వచ్చింది. 45 ప్రీ స్కూల్స్, 26 అనాధాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు, 1800 మంది విద్యార్థులకు ఉచిత చదువు చదివించి, ఎందరినో ఆదుకున్నారు. చివరికి తన మరణానంతరం కళ్లను కూడా దానం చేసి సేవాగుణం లో చెరగని ముద్రవేసుకున్నాడు. భవిష్యత్తు మన చేతిలో లేదు, గతాన్ని వెనక్కు తీసుకు రాలేము. ఎలా ఉంటే అలా జరుగుతుంది. విధిరాతను ఎవరూ మార్చలేరు అంటూ రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పునీత్ రాజ్ కుమార్ సామాజిక మాధ్యమం లో వ్యాఖ్యానించారు.


 ఇప్పుడవి ఆయన జీవితానికి వర్తిస్తాయని, ఊహించలేకపోయామని అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి,సమాజ సేవకుడు, ఎప్పుడూ ముందుండే తమ అప్పూ ఇక లేడని జీర్ణించుకోలేక విలపిస్తున్నారు. ప్రాంతాలు, భాషలతో సంబంధం లేకుండా ఎంతో మంది స్నేహితులను, అభిమానులను సంపాదించుకున్న కన్నడ పవర్ స్టార్ రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణం సినీ లోకాన్ని కన్నీట ముంచింది. లక్షలాది అభిమానులను  విషాదంలోకి నెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: