తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. సూపర్ ఎలక్ట్రిక్ కార్ ఇదే?

Purushottham Vinay
MG మోటార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.క్వాలిటీ కార్లని మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తూ వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది ఈ కంపెనీ. ఇక ఇండియాలో తన రెండవ ఎలక్ట్రిక్ కారు MG కామెట్‌ను రిలీజ్ చేసింది. రూ.7.98 లక్షలుగా కంపెనీ దీని ధరని ప్రకటించింది. ఇది ఇండియాలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు. ఈ కారును రెండు వేరియంట్లలో అమ్మనున్నారు.మే 15 వ తేదీ నుంచి ఈ కారు బుకింగ్స్ స్టార్ట్ కానున్నాయి. ఇది ఒక 2 డోర్ 4 సీటర్ కారు. ఇది మనకు అనుకూలంగా చాలా కాంపాక్ట్ సైజులో వస్తుంది.దీని పొడవు కేవలం 3 మీటర్ల కంటే తక్కువ. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఏకంగా 230 కి.మీ. ప్రయాణించవచ్చు.దీన్ని ఒక నెల రోజులు నడపాలంటే అయ్యే ఖర్చు కేవలం రూ.599 మాత్రమే.ఇంకా ఈ కారు ప్రత్యేకమైన, కాంపాక్ట్ డిజైన్‌కు బాగా ప్రసిద్ధి చెందింది. ఇది స్ప్లిట్ హెడ్‌లైట్లు, పూర్తి LED లైట్లు, స్టైలిష్ వీల్స్, పొడవైన C-పిల్లర్ ఇంకా 2 డోర్‌లతో ఉండి డ్యూయల్-టోన్ పెయింట్‌ను కలిగి ఉంది.

MG కామెట్ 2,974 mm పొడవు, 1,505 mm వెడల్పు ఇంకా 1,631 mm ఎత్తును 2,010 mm వీల్‌బేస్‌తో రానుంది.అలాగే ఈ కారులో 10.25 అంగుళాల రెండు స్క్రీన్లు కూడా ఇవ్వబడ్డాయి. ఇది ఆపిల్ ఐపాడ్‌లో డిజైన్ చేయబడిన కంట్రోల్ బటన్‌లతో 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది. ఇక ఫీచర్‌ల లిస్టులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, డిజిటల్ కీ, పవర్ విండోస్, గ్రే ఇంటీరియర్ థీమ్ ఇంకా అలాగే లెదర్-లేయర్డ్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో ఉన్నాయి.అలాగే ఈ MG కామెట్ EV 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇక సాధారణ ఇంటి సాకెట్ ద్వారా 0-100%  ఛార్జ్ చేయడానికి సుమారు 7 గంటలు పడుతుంది. MG కారులో 3.3 kW ఛార్జర్ అనేది ఉంది. అధికారిక సమాచారం ప్రకారం, దీని రేంజ్ 230 కిలోమీటర్లు. ఎలక్ట్రిక్ మోటార్ 42 PS గరిష్ట శక్తిని ఇంకా 110 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: