మహీంద్రా థార్ ధర పెంపు.. ఎంతంటే?

Purushottham Vinay
మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కొంచెం ఆగండి. మీకు ఒక బ్యాడ్ న్యూస్ వుంది. కార్ల తయారీ కంపెనీలు అన్నీ వరుస పెట్టి తమ కార్ల ధరలు పెంచుకుంటూ వెళ్తున్నాయి.ఇప్పుడు మరో కంపెనీ కూడా ఇదే దారిలో వెళుతుంది.తన కారు ధరను ఆ కంపెనీ చాలా భారీగా పెంచేసింది. దీంతో కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వారిపై ఇప్పుడు ఖచ్చితంగా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇండియాలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న మహీంద్రా కంపెనీ తాజాగా కార్ల ధరలు పెంచడం జరిగింది.కంపెనీ పాపులర్ మోడల్ అయిన థార్ కారు ధరను పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వారిపై ఖచ్చితంగా చాలా పెద్ద ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. బీఎస్ 6 స్టేజ్ 2 నిబంధనల కారణంగా కార్ల ధరలు పెంచాల్సి వచ్చిందని మహీంద్రా కంపెనీ పేర్కొంటోంది.మహీంద్రా థార్ మోడల్‌లో మోస్ట్ పాపులర్ వేరియంట్ అయిన ఎల్‌ఎక్స్ డీజిల్ మ్యానువల్ హార్డ్ టాప్ రియర్ వీల్ డ్రైవ్ ధర చాలా ఎక్కువగా పెరిగింది. దీని ధర ఏకంగా రూ. 1.05 లక్షలు పెరిగింది.ఇంకా అలాగే బేస్ స్పెసిఫికేసన్ ఏఎక్స్ (ఓ) డీజిల్ మ్యానువల్ హార్డ్ టాప్ రియర్ వీల్ డ్రైవ్ ధర వచ్చేసి రూ. 55 వేలు పైగా పెరిగింది.


ఇక మిగతా థార్ వేరియంట్లు ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్లు ఇంకా పెట్రోల్ ఆటోమేటిక్ వెర్షన్ వేరియంట్లు ధర మొత్తం రూ. 28,200 పెరిగింది. ఇప్పుడు ఫోర్ వీల్ డ్రైవ్ వెర్షన్ ధర వచ్చేసి రూ. 13.49 లక్షల నుంచి రూ. 16.77 లక్షల దాకా ఉంది. అయితే ఇవ్వన్నీ కూడా ఎక్స్‌షోరూమ్ ధరలు.ఇక ఇప్పుడు మహీంద్రా థార్ ఎంట్రీ లెవెల్ మోడల్ ధర వచ్చేసి ఏకంగా రూ. 55 వేలు పెరిగింది. దీని వల్ల మునుపటి కన్నా ఇప్పుడు థార్ ధరలు చాలా పెరిగాయని చెప్పుకోవచ్చు. మహీంద్రా థార్ కారు ప్రధానంగా రెండు వెర్షన్లలో మనకు లభిస్తోంది. రియర్ వీల్ డ్రైవ్ ఇంకా ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనేవి ఇది. రియర్ వీల్ డ్రైవ్ వెర్షన్ మళ్లీ రెండు పవర్ ట్రైన్ ఆప్షన్లలో మనకు లభిస్తుంది. ఇక 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఉంది. ఇక ఫోర్ వీల్ డ్రైవ్‌లో 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇంకా 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఉంది. ఈ రెండు పవర్ ట్రైన్ ఆప్షన్లు 6 స్పీడ్ మ్యానువల్ అలాగే 6 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: