హోండా యాక్టీవా: సూపర్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ వెర్షన్?

Purushottham Vinay
వినియోగదారులు ఎంతో కాలంగా  ఆసక్తిగా ఎదురుచూస్తున్న హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వేరియంట్ రాబోతుంది.  హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ తన ఎలక్ట్రిక్ బైక్స్ రోడ్ మ్యాప్ ను ప్రకటించింది. 2024 పూర్తయ్యే నాటికి రెండు ఎలక్ట్రిక్ బైక్స్ తో పాటు స్వాపబుల్ బ్యాటరీ సదుపాయాన్ని కూడా తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇంకా అలాగే 2030 కల్లా 10లక్షల ఎలక్ట్రిక్ బైక్స్ తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇక హోండా కంపెనీ నుంచి ముందుగా రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు మిడ్ రేంజ్‍లోనే ఉంటాయని సమాచారం తెలుస్తుంది.మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌గా యాక్టివా ఎలక్ట్రిక్‍ను హోండా తీసుకురానున్నట్టు సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే పెట్రోల్ స్కూటర్ విభాగంలో అమ్మకాల పరంగా హోండా యాక్టివా టాప్‍ ప్లేస్ లో ఉంది. అందుకే యాక్టివా పేరుతోనే మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ తెచ్చేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇది అందుబాటు ధరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ బైక్ ఫిక్స్డ్ బ్యాటరీతోనే రావొచ్చు. యాక్టివా బైక్ తర్వాత స్వాపబుల్ బ్యాటరీ సదుపాయంతో మరో ఎలక్ట్రిక్ టూ-వీలర్‌ను హోండా తీసుకొస్తుందని సమాచారం తెలుస్తుంది.


ఇది హోండా ఈఎం1ఈ అయ్యే అవకాశం ఉంది. ఈ స్వాపబుల్ సదుపాయం ఉంటే.. చార్జ్ అయిపోయిన బ్యాటరీని బయటికి తీసి.. దాన్ని సింపుల్ గా చార్జ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.ఇంకా అలాగే సపోర్ట్ చేసే వేరే బ్యాటరీని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన ప్లాట్‍ఫామ్‍పై ఎలక్ట్రిక్ టూ-వీలర్లను హోండా తయారు చేయనుంది.ఇక కర్ణాటక రాష్ట్రంలోని నర్సాపుర ప్లాంట్‍లో 2030 నాటికి మొత్తం 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని హోండా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు కావాల్సిన బ్యాటరీలను ఇంకా పవర్ కంట్రోల్ యూనిట్లను ఇండియన్ కంపెనీల నుంచే కొనుగోలు చేయాలని హోండా కంపెనీ భావిస్తోంది. ఇండియన్ మార్కెట్‍లోకి తీసుకురానున్న ఎలక్ట్రిక్ టూ-వీలర్లను కర్ణాటకలోని నర్సాపూర ప్లాంట్‍లో తయారు చేయనున్నట్టు హోండా కంపెనీ పేర్కొంది.అలాగే గ్లోబల్ మార్కెట్లకు కూడా ఎగుమతులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఇంకా అలాగే బ్యాటరీల చార్జింగ్ కోసం దేశవ్యాప్తంగా మొత్తం 6,000 టచ్ పాయింట్లను రెడీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: