త్వరలో రానున్న కియా కార్నివాల్ ఫోర్త్ జనరేషన్?

Purushottham Vinay
ఇండియన్ మార్కెట్లో 7 సీటర్ విభాగంలో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన 'కియా కార్నివాల్' కార్ త్వరలోనే మరిన్ని కొత్త ఫీచర్స్ తో విడుదల కావడానికి రెడీ అవుతుంది.ఇక ఇందులో భాగంగానే ఫోర్త్ జనరేషన్ కియా కార్నివాల్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది.ఫోర్త్ జనరేషన్ కియా కార్నివాల్ ఇండియన్ మార్కెట్లో ఇంకా స్టార్ట్ కాలేదు, అయితే ప్రస్తుతం సౌత్ కొరియాలో ఈ కార్ టెస్టింగ్ దశలో ఉంది. ఈ లేటెస్ట్ కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ దాని పాత మోడల్ కంటే కొత్త డిజైన్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ వంటి వాటిని పొందే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.కొత్త కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ ఇండియన్ మార్కెట్లో విడుదలకానున్న కొత్త కియా ఈవి9 లాగా ఉంటుంది. అందువల్ల వర్టికల్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ కలిగి రీడిజైన్ బోనెట్ ని పొందుతుంది.ఇంకా అలాగే అల్లాయ్ వీల్స్ దాదాపు మారే అవకాశం లేదు. రియర్ ఫ్రొఫైల్‌లో టెయిల్ లాంప్ కూడా కొత్తగా ఉంది.అయితే ఈ కారు పూర్తిగా కప్పబడి ఉండటం వల్ల మొత్తం డిజైన్ ఇంకా వెల్లడి కాలేదు.


ఫోర్త్ జనరేషన్ కియా కార్నివాల్ డిజైన్ కొంత వరకు వెల్లడైంది.కానీ ఫీచర్స్ గురించి ఎటువంటి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇక రానున్న రోజుల్లో కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్స్ వెల్లడవవుతాయి.ఈ కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్‌ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్స్ గురించి అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఇది హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ పొందే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే లేటెస్ట్ కార్నివాల్ ఎలక్ట్రిక్ మోటారుతో యాడ్ చేసిన 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ని పొందనుంది. ప్రస్తుతం ఈ ఎంపివి 2.2 లీటర్ డీజిల్ ఇంకా 3.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ ని కలిగి ఉంది.ఇక కియా కార్నివాల్‌ను కంపెనీ ఈమధ్య జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో KA4 ఎంపివిగా లాంచ్ చేసింది. ఇది ఈ ఏడాది చివరి నాటికి ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా అదే సమయంలో కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ 2024 జనవరి నాటికి గ్లోబల్ మార్కెట్లో విడుదలవుతుందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: