ఇండియాలో ఫస్ట్ సోలార్ కార్ వచ్చేస్తోంది?

Purushottham Vinay
పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా ఇండియన్ మార్కెట్ అంతా పర్యావరణ రహితమైన సీఎన్జీ, ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లను అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ చాలా సిటీల్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుంది. ఇక వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ కంపెనీలు అప్డేటెడ్ ఫీచర్లతో వాహనాలను లాంచ్ చేస్తున్నాయి.ఇక ఇదే క్రమంలో మన దేశంలోనే ఫస్ట్ టైం సోలార్ కార్ ను పూణేకు చెందిన ఓ ఈవీ స్టార్టప్ కంపెనీ లాంచ్ చేసింది.దీనిని ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్ పో 2023 లో ప్రదర్శించడం జరిగింది. ఇక ఈ కార్ కి సంబంధించిన, స్పెసిఫికేషన్లు, డిజైన్ ఇంకా ఫీచర్ల గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం..ఇక పూణే కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ కంపెనీ Vayve Mobility తన ఫస్ట్ సోలార్ బేస్డ్ కారు ఈవాను లాంచ్ చేసింది. ఇక దీని లుక్ కొంచెం టాటా నానో కారును పోలి ఉంది. ఈ కార్ కి పెద్ద వాళ్లు ఇంకా ఒక పిల్లవాడు కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ కారు రూఫ్ పైన సోలార్ ప్యానళ్లను ఫిక్స్ చేశారు.


ఈ సోలార్ ప్యానళ్లు కారులోని బ్యాటరీలను చార్జ్ చేయడానికి సహాయపడతాయి. ప్రస్తుతం ఈ కారు టెస్టింగ్ స్టేజిలో ఉంది. 2024 నాటికి వినియోగదారులకు ఈ కార్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఇంకా ఈ ఈవా కారు 6 కిలోవాట్ల సామర్థ్యంతో లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ ను కలిగి ఉంటుంది. ఈ కార్ 14kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది.అలాగే సింగిల్ చార్జ్ తో 250 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో ఇంకా అలాగే యాపిల్ కార్ ప్లే కనెక్టెవిటీ సదుపాయం కూడా ఉంది.ఇంకా ఈ కారుకు సంబంధించిన యాక్ససరీస్ అన్నీ కూడా కారుతో పాటే వస్తాయి. అయిదే వీటి ధర ఇంకా వాటి వివరాలు కంపెనీ తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. పూణే, బెంగళూరు నగరాల్లో వచ్చే సంవత్సరం నుంచి దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.ఈ కార్ మార్కెట్లో రిలీజ్ అయ్యి ఒక్కసారిగా క్లిక్ అయ్యిందంటే ఇక సామాన్య ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. చూడాలి ఈ సోలార్ కార్ ఎలా ఆకట్టుకుంటుందో ఇంకా ఎలా అలరిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

EVA

సంబంధిత వార్తలు: