MG మోటార్స్: కొత్త సంవత్సరం నుంచి ధరలు పెంపు?

Purushottham Vinay
కొత్త సంవత్సరం 2023 ప్రారంభం నుంచే కార్ల తయారీ కంపెనీలు దాదాపు తమ వాహనాల ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఫేమస్ కార్ల తయారీ కంపెనీ 'ఎంజి మోటార్స్' కూడా రాబోయే జనవరి 01 వ తేదీ నుంచి ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఇక ఎంజి మోటార్స్ అందించిన సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే 2023 జనవరి 01 నుంచి తమ అన్ని కార్ల ధరలను దాదాపు రూ. 90,000 వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. అయితే ఏ వేరియంట్ మీద ఎంత పెంచనుంది వంటి వివరాలు మాత్రం కంపెనీ వివరించలేదు. ఇక అంతే కాకూండా కంపెనీ తమ కార్ల ధరలను పెంచడానికి తగిన కారణం కూడా ఇంకా వెల్లడించలేదు. ఇక పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల వల్ల ధరలు పెరుగుదల జరిగి ఉండే ఛాన్స్ ఉంది.ఇక ఇప్పటికే చాలా కంపెనీలు కూడా తమ కార్ల ధరలను 2023 జనవరి 01 నుంచి పెంచనున్నట్లు  వెల్లడించాయి.


కాబట్టి రాబోయే కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనే వారు ఇప్పుడున్న ధరలకంటే ఎక్కువ ధరలను చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల కొత్త కారు కొనాలకునేవారు 2023 రాక ముందే కొత్త కారు కొనుగోలు చేస్తే కొంత తక్కువ ధరతో కొత్త కారు కొనే అవకాశం ఉంటుంది.ఎంజి మోటార్  కార్లను ఈ నెలలోనే కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 90,000 ఆదా చేయవచ్చు. కాబట్టి కారు కొనుగోలు చేయాలనుకునే వారు దృష్టిలో ఉంచుకోవాలి.అయితే అలా కాకుండా కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటే మీరు ఖచ్చితంగా కొంత ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ధరలు పెంచిన కంపెనీల లిస్టులో ఎంజి మోటార్స్ కాకుండా.. మారుతి సుజుకి, కియా ఇండియా, రెనాల్ట్ , ఆడి ఇండియా, మెర్సిడెస్-బెంజ్ ఇంకా అలాగే జీప్‌ వంటివి కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: