గుడ్ న్యూస్: మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్?

Purushottham Vinay
ఇండియాస్ ఫేమస్ కార్ బ్రాండ్ అయిన మహీంద్రా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇండియన్ కార్ల విక్రయాలలో టాప్ లో దూసుకుపోతున్న మహీంద్రా తన ఫ్లాగ్‌షిప్ SUV కార్ల కొనుగోలుపై డిసెంబర్ నెల ఆఫర్‌ను ప్రకటించింది.కొత్త సంవత్సరానికి కొత్త కారుతో వెల్‌కమ్‌ చెప్పాలనుకుంటోన్న వారికి ఇది చాలా మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. మహీంద్ర కంపెనీ ఈ ఆఫర్‌లో భాగంగా క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఇంకా అలాగే కార్పొరేట్ డిస్కౌంట్‌లను కూడా అందిస్తోంది. ఇంకా ఈ డిస్కౌంట్‌ ద్వారా కొత్త కార్లపై రూ. 20 వేల నుంచి రూ. 1 లక్ష దాకా కూడా ఆదా చేసుకోవచ్చు కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ లభిస్తోంది లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..ఇక ఎక్స్‌యూవీ 300 కారుపై మహీంద్ర కంపెనీ మొత్తం రూ. 53 వేల నుంచి రూ. 1 లక్ష వరకు కూడా డిస్కౌంట్‌ అందిస్తోంది.XUV300కి చెంది W8(O) వేరియంట్ కొనుగోలుపై చాలా ఎక్కువ ఆఫర్ అందుబాటులో ఉంది, టర్బో స్పాట్ వెర్షన్ కూడా రూ. 60 వేల తగ్గింపు అనేది మీకు లభిస్తుంది.


బొలెరో నియో ఎస్‌యూవీ కారు కొనుగోలుపై మహీంద్రా కంపెనీ మొత్తం రూ. 68 వేల నుంచి రూ. 95 వేల వరకు కూడా డిస్కౌంట్‌ అందిస్తోంది. బొలెరో నియో SUV కార్ కి చెందిన N10 వేరియంట్‌లపై చాలా ఎక్కువ ఆఫర్ అందుబాటులో ఉంది, ఇది ఎంట్రీ-లెవల్ SUV కొనుగోలుదారులకు చాలా మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు.బొలెరో ఎస్‌యూవీ కారుపై మహీంద్ర కంపెనీ దాదాపు రూ. 33 వేల నుంచి రూ. 95 వేల దాకా డిస్కౌంట్‌ అందిస్తోంది. బొలెరో SUVకి చెందిన B8 (O) వేరియంట్‌పై కూడా ఆఫర్లను అందిస్తోంది. ఈ ఎస్‌యూవీ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది చాలా మంచి ఆప్షన్‌.ఇంకా అలాగే మహీంద్ర నుంచి థార్‌ చాలా ఎక్కువ అమ్మకాలతో రికార్డ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కారు వివిధ వేరియంట్‌ల ఆధారంగా కంపెనీ మొత్తం రూ. 20,000 డిస్కౌంట్‌ ని అందిస్తోంది.కాబట్టి ఆలస్యం చెయ్యకుండా ఈ ఆఫర్ ని వినియోగించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: