సూపర్ ఫీచర్లతో కొత్త టాటా టిగోర్ ఈవి?

Purushottham Vinay
ఇండియన్ మార్కెట్లో చాలా వేగంగా దూసుకుపోతూ అత్యంత ప్రజాదరణ పొంది ఇంకా అత్యంత నమ్మికమయిన ఫేమస్ ఆటోమొబైల్  కంపెనీ 'టాటా మోటార్స్' ఇప్పుడు అప్డేటెడ్ 'టిగోర్ ఈవి' ని విడుదల చేసింది.ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది కొత్త అప్డేటెడ్ 'టాటా టిగోర్ ఈవి'.ఈ కార్ 'మాగ్నెటిక్ రెడ్' అనే కొత్త కలర్  లో కూడా అందుబాటులో ఉంటుంది. అంతే కాకూండా ఇందులో దాని పాత స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. ఇంకా  రేంజ్ కూడా దాని పాత మోడల్ కంటే ఎక్కువ. అందువల్ల ఈ కొత్త 2022 టిగోర్ EV రేంజ్ ఇప్పుడు 315 కిమీ వరకు ఉంటుంది.టాటా టిగోర్‌  పాత మోడల్  రేంజ్ 306 కిమీ. ఈ కొత్త అప్డేటెడ్ టాటా టిగోర్ EV మల్టీ మోడ్ రీజెన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఇంకా టైర్ పంక్చర్ రిపేర్ కిట్ వంటి 10 కొత్త స్మార్ట్ ఫీచర్‌లతో వస్తుంది. మల్టీ మోడ్ రీజెన్ అనేది నెక్సాన్ ఈవి మ్యాక్స్ వంటి వాటిలో కూడా అందుబాటులో ఉంది.


ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు ఎంతో అనుకూలంగా ఉంటాయి.ఈ కార్ మొత్తం నాలుగు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంది. అవి ఎక్స్ఈ, ఎక్స్‌టి, ఎక్స్‌జెడ్ ప్లస్ ఇంకా అలాగే ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్. ఈ టాటా టిగోర్ ఈవి 'ఎక్స్ఈ' ధర రూ. 12.49 లక్షలు కాగా, టాప్ వేరియంట్ 'ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్' ధర రూ. 13.75 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఎక్స్‌జెడ్ ప్లస్ ఇంకా ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ వేరియంట్స్ కొత్తగా పరిచయం చేయబడ్డాయి.ఇంకా అలాగే ఈ కార్ 26 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ని పొందుతుంది. ఇది IP67 సర్టిఫికేషన్‌ పొందింది. అందువల్ల ఇది దుమ్ము ఇంకా అలాగే నీరు వంటి వాటిని నుంచి రక్షించబడే విధంగా ఉంటుంది. ఇది మాక్సిమం 74 బిహెచ్‌పి పవర్ ఇంకా 170 ఎన్ఎమ్ టార్క్ ని కలిగి ఉంది. టియాగో ఈవి కేవలం 5.7 సెకన్లలోనే 0 నుంచి 60 కిమీ వరకు స్పీడ్ వెళుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: