మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి విడుదల?

Purushottham Vinay
మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో తన సిఎన్‌జి లైనప్‌ను విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే  ఇండియన్ మార్కెట్లో మరో కొత్త cng కారుని విడుదల చేసింది.అదే 'మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి' (Maruti S-Presso CNG). ఇండియన్  మార్కెట్లో విడుదలైన కొత్త 'మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి' (Maruti S-Presso CNG) ప్రారంభ ధర రూ. 5.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి LXi ఇంకా VXi. ఇందులో LXi వేరియంట్ ధర రూ. రూ. 5.90 లక్షలు కాగా, VXi వేరియంట్ ధర రూ. 6.10 లక్షలు (ఎక్స్-షోరూమ్).కొత్త మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో cng వెర్షన్ దాని పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 95,000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. దీన్ని బట్టి చూస్తే పెట్రోల్ వేరియంట్ కంటే కూడా cng వేరియంట్ ఖరీదైనది.అయితే మంచి మైలేజ్ అందిస్తుంది.మారుతి సుజుకి  సిఎన్‌జి లైనప్‌లో ఈ S-ప్రెస్సో cng అనేది 10 వ మోడల్.S-ప్రెస్సో cng  ఇంజిన్ 5300 ఆర్‌పిఎమ్ వద్ద 56.69 పిఎస్ పవర్ అందిస్తుంది. అయితే cng మోడ్‌లో 3400 ఆర్‌పిఎమ్ వద్ద మాక్సిమం 82.1 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో cng దాదాపుగా 32.73 కిమీ/కేజీ పరిధిని అందిస్తుంది.కొత్త మారుతి ఎస్-ప్రెస్సో cng వెర్షన్ ఫ్యూయెల్ ఆప్షన్స్ తో cng ట్యాంక్ కలిగి ఉండటం వల్ల ఇప్పుడు అదనపు బరువును కూడా పొందుతుంది.


 అయితే ఈ కొత్త కారు  రైడ్ క్వాలిటీ ఇంకా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి సస్పెన్షన్ సెటప్‌ కూడా కొంత అప్డేట్ చేయబడింది. అందువల్ల మంచి పనితీరుని పొందవచ్చు. ఇప్పుడు మారుతి సుజుకి  ఎస్-ప్రెస్సో పెట్రోల్-వెర్షన్ మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ దీపావళి పండుగ సమయంలో ఈ కారుపైన దాదాపు రూ. 55,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇంకా రూ. 5,000 కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు.మారుతి ఎస్-ప్రెస్సో పెట్రోల్ ధరలు ఇండియన్ మార్కెట్లో రూ. 4.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. అందువల్ల కొత్త కారును కొనాలనుకునే కస్టమర్లు ఈ పండుగ సీజన్లో తప్పకుండా ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.అంతే కాకుండా ఈ ఆఫర్స్ గురించి మరింత ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి దగ్గరలోని కంపెనీ డీలర్షిప్ లో తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: