లెక్సస్ ES 300h: మరింత అందం.. మరెన్నో ఫీచర్స్?

Purushottham Vinay
ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ అయిన లెక్సస్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఎట్టకేలకు తన అప్డేటెడ్ 'ఈఎస్ 300హెచ్' (ES 300h) సెడాన్ విడుదల చేసింది. ఈ కొత్త సెడాన్ ప్రారంభ ధర రూ. 59.71 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). కొత్తగా ప్రారంభించబడిన ఈ హైబ్రిడ్ లగ్జరీ సెడాన్ రెండు ట్రిమ్స్ లో లభిస్తుంది. అవి ఎక్స్‌క్విజిట్ ఇంకా లగ్జరీ ట్రిమ్స్.ఈ సెడాన్ అప్డేట్ అయిన తరువాత ధరలు కూడా పెరిగాయి. కాబట్టి ఇప్పుడు బేస్ వేరియంట్ ధరలు రూ. 21,000 ఇంకా టాప్ వేరియంట్ అయిన లగ్జరీ ట్రిమ్ రూ. 31,000 పెరుగుదలను పొందింది. అందువల్ల ఇప్పుడు టాప్ వేరియంట్ ధరలు రూ. 65.81 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) చేరాయి.నిజానికి లెక్సస్ ES 300h అక్టోబర్ 2021 లో ప్రారంభమైంది, ఆ తరువాత ఇప్పుడు అప్డేట్ చేయడం జరిగింది. అంటే ఇది ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఒక సంవత్సర కాలానికి అప్డేట్ చేయబడింది. లెక్సస్ ES300h సెడాన్ ఇప్పుడు అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ ఇంకా టెయిల్‌గేట్‌పై కొత్త లెక్సస్ లోగో వంటి వాటిని పొందుతుంది.ఈ కొత్త సెడాన్ ఇప్పుడు అప్డేటెడ్ ఇంటీరియర్ ఫీచర్స్ కూడా పొందుతుంది.


ఇందులో సెంటర్ కన్సోల్ చుట్టూ మెరుగైన స్టోరేజ్ స్పేస్‌, లెక్సస్ డైనమిక్ వాయిస్ రికగ్నిషన్ ఫీచర్, హ్యాండ్స్-ఫ్రీ బూట్ ఇంకా వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే అలాగే ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన కొత్త అప్‌గ్రేడ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ వంటివి ఇందులో అప్డేట్ చేయబడ్డాయి. ఇంకా అంతే కాకుండా ఇందులో, మునుపటి మోడల్ లో మాదిరిగానే హెడ్స్-అప్ డిస్‌ప్లే, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్ రిక్లైన్ రియర్ సీట్లు, హ్యాండ్స్ ఫ్రీ బూట్ లిడ్ ఓపెనింగ్ ఇంకా 17 స్పీకర్ మార్క్ లెవిన్‌సన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఈ సెడాన్  డిజైన్ ఇంకా ఫీచర్స్ అప్డేట్ పొందినప్పటికీ.. ఇంజిన్ లో మాత్రం ఎటువంటి మార్పులు లేదు. కావున ఇందులో 2.5-లీటర్, 4-సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 176 బిహెచ్‌పి పవర్ ఇంకా 221 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఇందులో 118 బిహెచ్‌పి పవర్ ఇంకా 202 ఎన్ఎమ్ టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా కలిగి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: