ఎలక్ట్రిక్ వెహికిల్స్ కాలిపోవడానికి కారణాలు ఏంటి?

Purushottham Vinay
ఇక ఎలక్ట్రిక్ వెహికిల్స్ కాలిపోవడానికి కారణాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. బ్యాటరీ సెల్స్ ఇంకా మాడ్యూల్స్ లోపభూయిష్ఠంగా ఉండటమే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణమని ఓ పరిశోధన సంస్థ కూడా వెల్లడించింది.ఇక ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టి తీస్తామో అన్ని సార్లు ఖచ్చితంగా కనెక్టింగ్ పాయింట్స్ వద్ద స్పార్కింగ్ వస్తుంది. ఆ సమయంలో ఆ పాయింట్స్ అనేవి బర్న్ అయ్యి ప్లగ్ అనేది లోపలి వెళ్ళదు. ఆ ప్లగ్ పూర్తిగా లోపలి వెళ్లదు. ఆ ప్లగ్ సగం వరకే లోపలి వెళుతుంది. దీనివల్ల లూజ్ కాంటాక్ట్ అవుతుంది. ఈ కారణంగా కొద్దీ సేపు వెహికిల్ నడిచిన తరువాత హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక ప్లగ్ లూజ్ అవ్వడంతో బైక్ రన్నింగ్ లో ఉన్నపుడు ఆ ప్లగ్ పై మరింతగా లోడ్ పడడంవల్ల మంటలు చెలరేగుతాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. ప్రాపర్ గా ఛార్జింగ్ ప్లగ్ కనెక్ట్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా సురక్షితంగా ఉంటాయని వారు అంటున్నారు. ప్లగ్ పెట్టి ఛార్జింగ్ చేసే సమయంలో అవి బ్లాస్ట్ అవ్వవు. పది కిలోమీటర్లు దాటినతర్వాతనే పేలిపోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్లగ్ కనెక్ట్ చేసేటప్పుడు పూర్తిగా కనెక్ట్ అయ్యి లాక్ పడిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.


బ్యాటరీ విషయంలో ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు లేని సెల్స్ వాడడం కారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా పేలిపోతున్నాయి. ఇక చైనా నుంచి వచ్చే క్వాలిటీ సెల్స్ మార్కెట్ లో అందుబాటులో లేకపోవడంతో నాసిరకమైన సెల్స్ ను వినియోగిస్తున్నారు. దీనివల్ల ఈవీ వెహికల్స్ లో మంటలు బాగా చెలరేగడానికి ముఖ్య కారణమని మార్కెట్ నిపుణులు వెల్లడి స్తున్నారు. పలు కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించడం లేదు. ఇది కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కాలడానికి ఒక ప్రధాన కారణం. వర్షాలు పడినప్పుడు కూడా నీరు బ్యాటరీలోపలికి వెళ్లడంవల్ల కొన్ని వాహనాల్లో మంటలు ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాదు ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవు తున్నప్పుడు కూడా బ్యాటరీలు ఎక్కువసేపు పెట్టి అసలు వదిలేయకూడదు. అలా వదిలేయడంవల్ల కూడా బ్యాటరీలు పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టే తప్పుడు గానీ ఇంకా తీసేటప్పుడు గానీ జాగ్రత్తలు పాటించాలి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనేటప్పుడు ఖచ్చితంగా కష్టమర్లు బ్యాటరీకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: