తెలంగాణ : పేలిపోయిన మరో ఎలక్ట్రిక్ బైక్!

Purushottham Vinay
ఇక తెలంగాణలో మరో ఎలక్ట్రిక్ బైక్ పేలిపోయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఈ సంఘటన మంగళవారం నాడు రాత్రి జరిగింది. ఆ బైక్ తో పాటు ఇల్లు కూడా దగ్ధమైంది.ఓ వ్యక్తి రాత్రి బైక్ ఛార్జింగ్ పెట్టాడు. ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులు నిద్రపోయారు. రాత్రి పేలుడు శబ్దం రావడంతో దెబ్బకు లేచారు. బైక్ కాలిపోయి ఇంటికి మంటలు బాగా అంటుకున్నాయి. దాంతో ఇంటిలోని వారంతా కూడా బయటకు పరుగు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. అక్కడి స్థానికుల సమాచారంతో ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. ఆ ఫైరింజన్లు సకాలంలో రాకపోయి ఉంటే పక్క ఇళ్లకు కూడా మంటలు వ్యాపించి ఉండేవి.కాగా, మే12 వ తేదీన కూడా హైదరాబాద్ లో మరో ఎలక్ట్రిక్  బైక్ లో మంటలు లేచాయి.ఇక LB nagar చౌరస్తాలో ఓ ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు చెలరేగాయి. ఓ డెలివరీ బాయ్ ఎలక్ట్రిక్ బైక్ అగ్నికి కూడా ఆహుతి అయింది. ఆ డెలివరీ బాయ్ ఆర్డర్ పికప్ చేసుకుని వచ్చే సరికి అతని ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు లేచాయి. స్థానికులు ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి ఆ మంటలను ఆర్పారు. అకస్మాత్తుగా ఎలక్ట్రిక్ బైక్ లో బాగా మంటలు లేచాయి.

పెద్ద ఎత్తున లేచిన మంటలకు అక్కడివారు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు.ఇక ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ బైక్ లో అగ్నికి ఆహుతి అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మూడు రోజుల కిందట కరీంనగర్ లో ఇలాగే ఓ ఎలక్ట్రిక బైక్ కూడా తగలబడింది. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం రామచంద్రాపూర్‌లో ఒక ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ పేలింది. వివరాలు.. ఎగుర్ల ఓదెలు రెండు నెలల క్రితం బెన్లింగ్ ఫాల్కన్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాన్ని కూడా కొనుగోలు చేశారు.ఎప్పటిలాగే ఆ రోజు కూడా రాత్రి పడుకునే ముందు బ్యాటరీకి ఛార్జింగ్‌ ని పెట్టాడు. అయితే చార్జింగ్ పెట్టిన కొద్ది నిమిషాల్లోనే ఆ బ్యాటరీ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత బ్యాటరీలో పేలుడు కూడా సంభవించింది. అయితే ఇక అదృష్టవశాత్తూ.. ఇంటి బయట బ్యాటరీని ఛార్జింగ్ పెట్టడం.. పేలుడు జరిగిన సమయంలో అక్కడ ఎవరూ కూడా లేకపోవడంతో పెను ప్రమాదంతప్పింది. కాకపోతే, ఈ ఘటనలో ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: