Ola S1 Pro : ధరలు ఆకాశాన్ని మించాయిగా!

Purushottham Vinay
ఇండియన్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ ఇక క్రమంగా కొన్ని విమర్శలను కూడా ఎక్కువగా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం దీని అమ్మకాలు కూడా క్రమ క్రమంగా ముందుకు వెళుతున్నాయి. కంపెనీ ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేయడం కూడా స్టార్ట్ చేసింది. అయితే కొన్ని నివేదికల ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ 'ఓలా ఎస్1 ప్రో' (Ola S1 Pro) ధర వచ్చేసి మొత్తం రూ. 10,000 దాకా పెరిగినట్లు తెలిసింది. ఇక దీని గురించి మరింత సమాచారం ఇక్కడ మనం తెలుసుకుందాం..ఇక ప్రస్తుతం ధరల పెరుగుదల తరువాత 'ఓలా ఎస్1 ప్రో' (Ola S1 Pro) ధర వచ్చేసి రూ. 1.40 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. అయితే దేశంలో అందుబాటులో ఉన్న ఫేమ్-2 స్కీమ్ కింద ధరలు కూడా ఆయా రాష్ట్రాన్ని బట్టి తగ్గుతాయి. అయితే ఇప్పుడు ఓలా ఎస్1 ధర మాత్రం ఇంకా పెరగలేదు.అందుకే కొనుగోలుదారులు దీనిని తప్పకుండా గమనించాలి.ఇక ఓలా ఎలక్ట్రిక్ 2021 ఆగష్టు 15 వ తేదీన రూ. 1.30 లక్షల ధర వద్ద దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల అయ్యింది.

అలాగే మార్కెట్లో విడుదలయిన తరువాత కూడా మొదటిసారిగా ఓలా కంపెనీ ధరలను పెంచడం జరిగింది. అలాగే అంతే కాకుండా కంపెనీ ఇప్పుడు తన కస్టమర్ల కోసం మూడవ సారి సేల్స్ విండోని కూడా స్టార్ట్ చేసింది.అలాగే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఎలక్ట్రిక్ స్కూటర్ ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు ముందుగా స్కూటర్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. ఇక దీనికి సంబధించిన సమాచారం కంపెనీ కష్టమర్లకు తెలిపింది.కాబట్టి కొనుగోలుదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసి తమ ఎలక్ట్రిక్ స్కూటర్ పొందవచ్చని కూడా ఓలా కంపెనీ తెలిపింది.ఇక ఓలా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని టెస్ట్ రైడ్ చేయడానికి కూడా 5 నగరాల్లో టెస్ట్ రైడ్‌ స్టార్ట్ చేసింది. అలాగే కొనుగోలు చేసేముందు కస్టమర్లు ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ చేయాలనుకుంటే టెస్ట్ రైడ్ చేయడం కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక డెలివరీలు మరింత వేగవంతంగా జరిగే ఛాన్స్ అనేది ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: