సింపుల్ ఎనర్జీ నుంచి చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్!

Purushottham Vinay
ఇక బెంగళూరుకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సింపుల్ ఎనర్జీ (Simple Energy), గతేడాది ఇండియన్ మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ "సింపుల్ వన్" (Simple One) ను రిలీజ్ చేసిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు కూడా బాగా జోరుగా సాగుతున్నాయి. అలాగే ధరల విషయానికి వస్తే, మార్కెట్లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరలు వచ్చేసి రూ.1.09 లక్షల (సింగిల్ బ్యాటరీ) నుండి రూ.1.45 లక్షల (డబుల్ బ్యాటరీ) మధ్యలో ఉన్నాయి. అలాగే తాజా సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే కంపెనీ ఇప్పుడు ఓ చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది.ఇక భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతున్నప్పటికీ ఇంకా కస్టమర్లు మాత్రం తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.


ఇక ఈ నేపథ్యంలో, సింపుల్ ఎనర్జీ కూడా ఈ విభాగంలోని అవకాశాలను దక్కించుకునేందుకు తక్కువ ధర కలిగిన ఓ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీపై ఫుల్ ఫోకస్ పెట్టింది.ఓ నివేది ప్రకారం, కంపెనీ తరువాతి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ సంవత్సరం జూన్‌లో ఆవిష్కరించనుంది. ఇంకా అలాగే వచ్చే ఏడాది నాటికి మార్కెట్లో విడుదల కానుంది.ఇక సింపుల్ ఎనర్జీ ప్రస్తుతం అమ్ముతున్న సింపుల్ వన్ ఇ-స్కూటర్ కంటే ఇది చాలా చౌకగా ఉంటుందని సమాచారం. ఈ తదుపరి స్కూటర్ పూర్తిగా కొత్తగా ఉంటుందని ఇంకా అలాగే ప్రస్తుతం విక్రయిస్తున్న సింపుల్ వన్‌ అప్‌గ్రేడ్ కాబోదని కంపెనీ తెలిపింది. సింపుల్ వన్ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఇంకా అలాగే ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించే కొత్త ప్లాట్‌ఫారమ్‌పై కూడా కంపెనీ దీనిని నిర్మిస్తోంది. ఈ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఎక్కువ వివరాలను ఇంకా వెల్లడించినప్పటికీ,ఈ స్కూటర్ మార్కెట్లో ఉన్న అనేక ఇతర సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోటీ పడుతుందని మాత్రం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: