లోటస్ ఎలట్రే ఎలక్ట్రిక్ హైపర్ కార్: ఫుల్ ఛార్జ్ తో 600 km రేంజ్!

Purushottham Vinay
ఇక బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ లోటస్ (Lotus) తమ మొట్టమొదటి హైపర్ ఎలక్ట్రిక్ కారు "లోటస్ ఎలట్రే" (Lotus Eletre) ను అధికారికంగా లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్ల కోసం లోటస్ ప్రకటించిన మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఎలట్రే మొట్టమొదటి ఇంకా ఇది వచ్చే ఏడాది నాటికి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఈ హైపర్ ఎలక్ట్రిక్ కారు పేరుకు ఓ స్పెషాలిటీ ఉంది. ఇందులో Eletre అనే పదాన్ని తూర్పు యూరోపియన్ భాష నుండి తీసుకున్నారు. ఆ భాషలో దీని అర్థం 'జీవం పోసుకోవడం' (కమింగ్ టూ లైఫ్) అనే అర్థం వస్తుంది.లోటస్ ఎలట్రేతో ఈ సూపర్ కార్ బ్రాండ్ మొట్టమొదటి సారిగా ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. లోటస్ బ్రాండ్ 74 సంవత్సరాల చరిత్రలో, కంపెనీకి ఇదే ఫస్ట్ ఎలక్ట్రిక్ హైపర్ కారు. లోటస్ రానున్న 3-4 సంవత్సరాలలో మరో రెండు ఎలక్ట్రిక్ కార్లను కూడా లాంచ్ చేయనుంది.


లోటస్ ఎలక్ట్రిక్ కార్ లైనప్ లో ఓ స్పోర్ట్స్ కారు, స్పోర్ట్స్ సెడాన్ ఇంకా అలాగే కూపే ఎస్‌యూవీలు ఉండనున్నాయి.ఇక లోటస్ ఎలట్రే విషయానికి వస్తే, కంపెనీ దీనిని తమ అవిజా హైపర్‌కార్ నుండి ప్రేరణ పొందిన కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ తో తయారు చేసింది. ఇది పూర్కిగా సరికొత్త ఎలక్ట్రిక్ ప్రీమియం ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇది బహుళ పరిమాణాల బ్యాటరీలు, మోటార్లు ఇంకా స్మార్ట్ డ్రైవింగ్ టెక్నాలజీలకు అనుగుణంగా సౌకర్యవంతమైన ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. లోటస్ ఎలట్రే అనేక అప్డేటెడ్ టెక్నాలజీలతో రానుంది.లోటస్ ఎలట్రే పవర్‌ట్రెయిన్ గురించి పూర్తి వివరాలు ఇప్పటి దాకా వెల్లడి కాలేదు. అయితే, కంపెనీ ఈ హైపర్ కారులో 100 kWh కంటే ఎక్కువ పవర్ తో బ్యాటరీ ప్యాక్‌ ను ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. lotus Eletre

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: