ఇండియన్ మోటార్‌సైకిల్ నుండి సూపర్ మోడల్ విడుదల..!!

Purushottham Vinay
ఇక అమెరికాకు చెందిన ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ 'ఇండియన్ మోటార్‌సైకిల్' (Indian Motorcycle) తాజాగా ఓ లిమిటెడ్ ఎడిషన్ నేక్డ్ స్పోర్స్ట్ బైక్ ను మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ బ్రాండ్ ఈమధ్యనే తన ఫ్లాట్ ట్రాక్ లెగసీని జరుపుకుంది, ఇక ఇందులో భాగంగా ఇండియన్ మోటార్‌సైకిల్ తమ బ్రాండ్‌ లైనప్ లో కొత్త లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్‌టిఆర్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ (FTR championship Edition) ను రిలీజ్ చేసింది. ఈ కొత్త బైక్ కు సంబంధించిన మరిన్ని వివరాల గురించి ఇక ఇప్పుడు మనం ఈ కథనంలో తెలుసుకుందాం.ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ తెలిపిన సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..కొత్త ఎఫ్‌టిఆర్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ బైక్ ను కంపెనీ కేవలం 400 యూనిట్లు మాత్రమే ప్రొడక్షన్ చేయనుంది. అంటే, ఈ లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిల్ ప్రపంచ వ్యాప్తంగా కూడా కేవలం 400 మందికి మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటుందన్నమాట.


ఇక అంతేకాకుండా, ఈ మోటార్ బైక్ ను కొనుగోలు చేసిన రేస్ ప్రియులకు అమెరికన్ ఫ్లాట్ ట్రాక్ ఛాంపియన్‌షిప్‌ (American Flat Track Championship) లో భాగంగా జరగబోయే ఇండియన్ వ్రెక్ క్రూ (Indian Wreck Crew's) ఐదు వరుస విజయాల వేడుకలో చేరడానికి కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేస్ అభిమానులకు ఛాన్స్ ని కల్పిస్తుంది.అలాగే డిజైన్ పరంగా కూడా చూస్తే, కొత్త ఇండియన్ ఎఫ్‌టిఆర్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్ మోటార్‌సైకిల్, ఈ బ్రాండ్ విక్రయిస్తున్న ఎఫ్‌టిఆర్750 మోడల్ నుండి ప్రేరణ పొంది రూపొందించినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇక అంతేకాకుండా ఈ కంపెనీ తమ రేసింగ్ లెగసీని జరుపుకునేందుకు వీలుగా ఈ లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిల్ స్టాండర్డ్ రేస్ పెయింట్ స్కీమ్‌తో డిజైన్ చేయడం జరిగింది.


ఇంకా అలాగే దీనితో పాటుగా ఈ సూపర్ మోటార్‌సైకిల్ ‌ను మరింత ప్రత్యేకంగా మార్చడానికి, ఫ్లాట్ ట్రాక్‌లో బ్రాండ్ విజయాన్ని గుర్తుచేసే ప్రతి ఛాంపియన్‌షిప్ సీజన్ ‌లో కూడా ఇండియన్ మోటార్‌ బైక్ రేసింగ్ బెజెల్ కూడా డిస్‌ప్లే చేయబడి ఉంటుంది.ఇక ఈ సూపర్ మోటార్‌సైకిల్ ఫ్యూయెల్ ట్యాంక్ పై గ్లోసీ కార్భన్ ఫైబర్ ఫినిషింగ్ తో కుడిన ప్యాటర్న్ చాలా ప్రత్యేకంగా ఇంకా అలాగే చాలా ప్రీమియంగా కూడా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: