ఓకినావా లైట్ ఈ- స్కూటర్​ ప్రత్యేకతలు అదరహో..

Satvika
ప్రతి ఒక్కరూ కూడా ఎలెక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అదే విధంగా ఆయా కంపెనీలు కూడా వాహనాలను సరి కొత్త టెక్నాలజీ తో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. అది కూడా లైసెన్స్ అవసరం లేకుండా వస్తున్నాయి. వినడానికి వింతగా ఉంది కదా.. అదేంటో ఇప్పుడు చూద్దాం..రోడ్డుపై ఏదైనా వాహనాన్ని నడపాలంటే మీరు తప్పకుండా లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, బీమా పత్రాలను కలిగి ఉండాలి. లేదంటే పోలీసులు మీ వాహనాన్ని ఆపి ఫైన్ వేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే..

అయితే, కొన్ని వాహనాల కు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఇవి 250 వాట్ల మోటారుతో అమర్చబడి 25 కిలోమీటర్ల కంటే తక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి. వీటిని నడపడానికి ఎటువంటి లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అలాంటి వాహనాలు కూడా ఉన్నాయా? అని ఆశ్చర్య పోతున్నారు.. ఉన్నాయి.ఎలక్ట్రికల్ వాహనాల స్టార్టప్ సంస్థ ఓకినావా నుండి విడుదలైన ఓకినావా లైట్ ఈ- స్కూటర్ను ఎటువంటి లైసెన్స్ లేకుండానే నడపవచ్చు. ఆల్-ఎల్ఈడి హెడ్‌ ల్యాంప్, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈడీ టైలాంప్, ఎల్‌ఈడీ ఇండికేటర్స్ వంటి అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 250 వాట్ల బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటారు తో జతచేయబడి ఉంటుంది.

 దీనిలో 1.25 కిలోవాట్ల లిథియం- అయాన్ బ్యాటరీని అందించారు. ఇది ఒకే ఛార్జీ పై 60 కిలో మీటర్ల వరకు ప్రయాణించగలదు. ఒకినావా లైట్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4-5 గంటలు పడుతుంది. ఇది 25 కిలోమీటర్ల వేగం తో నడుస్తుంది. స్కూటర్‌కు ఈ-ఎబిఎస్ తో పాటుగా డిస్క్ బ్రేక్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.. లైసెన్స్, పియుసి, ఇన్సూరెన్స్ వంటివి లేకుండానే ఒకినావా ఆర్ 30 ఈ-స్కూటర్ను నడుపవచ్చు.. అందుకే వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: