లైసెన్స్ అక్కర్లేని ఆ బండి ఏంటో తెలుసా..?

Satvika
ఇప్పుడు ట్రెండ్ మారింది.. టెక్నాలజీ మారింది.. ముఖ్యంగా కాలుష్యాన్ని అరికట్టే దిశగా ఆటో మొబైల్స్ కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి..అయితే గతం లో పెట్రోల్ కన్న ఎక్కువగా గ్యాస్ ను వాడేవారు. వాటి వల్ల ఎక్కువగా పేలుళ్లు సంభవిస్తున్నాయి.. ప్రమాదాలు జరిగినప్పుడు గ్యాస్ లీక్ అవ్వడంతో ప్రమాదాలు మళ్లీ మొదటికి వచ్చాయి.. దీంతో ఇప్పుడు ఎలెక్ట్రానిక్ వాహనాలు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.. వాహన ప్రియులకు తగ్గట్లు కంపెనీలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.. ఈ మధ్య ఎలెక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు కూడా భారీగా పెరిగింది.

తాజాగా హైదరాబాద్ కు చెందిన విద్యుత్ వాహన సంస్థ ఆటుమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను లాంచ్ చేసింది. అదే ఆటూమ్ 1.0 ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్. ఎక్స్ షోరూంలో ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర వచ్చేసి రూ.50,000 లుగా సంస్థ నిర్ణయించింది. ఈ బైక్ ను కేవలం 4 గంటల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు అని కంపెనీ వెల్లడించింది. ఈ ఆటూమ్ 1.0 ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్ బైక్ కు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు...


ఇక మరో విషయమేంటంటే.. ఈ వాహనానికి రెండేళ్లు పాటు గ్యారంటీ ఇస్తున్నట్లు తెలుస్తుంది.ఈ మోటార్ సైకిల్ కు 2 సంవత్సరాల బ్యాటరీ వారంటీ ఇచ్చింది సంస్థ. వాహనానికి సంబంధించి ఉపయోగించిన విడిభాగాలకు కూడా ఈ వారంటీ వర్తిస్తుంది. ఈ వాహనాన్ని కొనడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదట..అంతేకాదు మరి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ బైక్ ను నడపడానికి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదని చెబుతున్నారు.ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్ పోర్టబుల్ బరువు తక్కువగా ఉంటుంది. దీని బ్యాటరీ బరువు 6 కేజీలు. ఛార్జింగ్ కోసం ఓ యూనిట్ విద్యుత్ ను వాడుకుంటుంది. కాగా, 100 కిలో మీటర్ల ప్రయాణానికి కేవలం 7 నుంచి పది రూపాయల లోపు మాత్రమే చార్జీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. తక్కువ ఖర్చుతో , ఎక్కువ దూరం ప్రయాణించే ఈ వెహికల్ కొనడానికి జనాలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: