ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీటర్లు..!

Durga Writes

ఈ మధ్యకాలంలో ఎన్ని ఎలెక్ట్రిక్ బైక్ లు, కార్లు వస్తున్నాయో అన్ని చూస్తూనే ఉన్నాం.. అతి తక్కువ ధరకే ఈ ఎలెక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వాహనాల సామర్ధ్యం తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు భారత్ లో విడుదల అయినా ఎలెక్ట్రిక్ వాహనం ఫీచర్లు మాత్రం అదిరిపోయాయి అనుకోండి. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన డెట్రాయిట్‌ ఇంజినీర్డ్‌ ప్రొడక్ట్‌ తన ఎలక్ట్రిక్‌ స్కూటర్ ను నిన్న గురువారం భారత్ మార్కెట్ లో లాంచ్‌ చేసింది. అయితే బైక్ కు అన్ని బైకులకు బిన్నంగా ఉంది. అంత వెరైటీ ఏంటి అంటే.. ఈ బైక్ ఎలెక్ట్రిక్ వాహనం అయినప్పటికీ ఇది రీ-మూవబుల్‌ బ్యాటరీ ఉంది. 

 

ఈ రిమూవబుల్ బ్యాటరీ వల్ల ఇంటిలో అయినా, పబ్లిక్ ప్లేస్‌ల లో అయినా ఈజీగా చార్జింగ్‌ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ బైక్ కు ఒకసారి చార్జింగ్‌ చేస్తే 150 కి.మీ వరకు నడుస్తుంది.. ఇంకా గంటకు దాదాపు 60 కిలో మీటర్ల స్పీడ్ నడవగలదు అని ఈ సంస్ద అధికారులు చెప్తున్నారు. కాగా ఎలెక్ట్రిక్ స్కూటర్ ధర ఇంకా తెలియలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: