'కీర్తి సురేష్'... స్టార్ హీరోయిన్ కు ఏమి తక్కువ ?

VAMSI
తాజాగా సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది కీర్తి సురేష్. మహానటి సినిమా తరువాత ఈమె కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే ఈ సినిమానే అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇంత పెద్ద సక్సెస్ అందుకున్న అమ్మడి చేతిలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేదు, కనీసం ఏ స్టార్ హీరో సినిమా కోసం ఈమెకు సంప్రదింపులు రాలేదు అన్నది ఇండస్ట్రీలో వినపడుతున్న టాక్. అయితే దీనికంతటికీ కారణం స్వయంగా కీర్తి సురేష్ చేసిన పొరపాటే అంటున్నారు. గ్లామరస్ పాత్రల్ని పోషించినప్పటికీ కీర్తి సురేష్ కి స్టార్ హీరోయిన్ రేంజ్ లో హోదా దక్కలేదని చెప్పాలి. అయితే ఆ రేంజ్ లో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోంది ఈ చిన్నది. నిజానికి ఒక సినిమా బిగ్గెస్ట్ హిట్ అయితే ఇక ఆ హీరోయిన్ కి వద్దన్నా వరుస స్టార్ హీరో ఆఫర్లు వచ్చిపడుతున్నా రోజులివి.
అలాంటిది మహి లాంటి అగ్ర హీరోతో మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్న కీర్తి సురేష్ చేతిలో ఆ స్థాయి ఆఫర్లు లేవన్నది వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఈమె మహానటి వంటి సంచలన విజయం తరవాత  ఈమె వరుసగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకే ఓటేసింది. అవైనా సరైన విజయం అందుకున్నాయా.. అంటే అదీ లేదు. నిజానికి ఫేడౌట్ అవుతున్న తరుణంలో చాలామంది తీసుకునే ఆప్షన్ ఇది అలాంటిది కెరియర్ యు టర్న్ తీసుకున్న సమయంలో ఇలాంటి జోనర్ జోలికి వెళ్లి కీర్తి పొరపాటు చేసిందని అంటున్నారు. అలా ఆ సినిమాల్లో ఈమె ఎక్కువగా కనిపించడంతో ఇపుడు సర్కారు వారి పాట వంటి సినిమా సక్సెస్ తర్వాత కూడా పెద్దగా ప్రయోజనం లేకపోయింది అంటున్నారు.
మరి ఇకనైనా ఈ అందాల తార లేడీ ఓరియంటెడ్ చిత్రాల వైపు చూడకుండా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం దక్కించుకునే ప్రయత్నం చేయడం మంచిది. అలాగే ఇపుడు ఈమె నాని సినిమా దసరాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  కాగా ఈ చిత్రంలో కూడా సర్కారు వారి పాట వంటి హిట్ పడితే కీర్తి కెరియర్ మళ్ళీ ఊపందుకోవడం  ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: