హీరోయిన్ రిచా ను ప్రేమ పేరుతో మోసం చేసిన స్టార్ హీరో ఎవరు?

VAMSI
రంగుల ప్రపంచం సినీ పరిశ్రమ గురించి ఎపుడు వందల సంఖ్యలో వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని వాస్తవాలు కాగా, మరికొన్ని ఒట్టి కల్పితాలు మాత్రమే. వారి స్వలాభం కోసం కొందరు స్వార్ధపరులు పలువురు స్టార్స్ గురించి కవ్వించి రాస్తూ వాటిని హైలెట్ చేస్తుంటారు. వీటిని కొందరు సెలబ్రిటీలు చూసి చూడనట్టు వడిలేయగా, మరికొందరు ఇదేంటి మా గురించి తప్పుడు వార్తలు రాస్తారా అంటూ తిట్టిపోస్తారు... ఇంకొందరు వారి భరతం పట్టే వరకు విడిచి పెట్టరు. ఇలా చాలానే జరుగుతూ ఉంటాయి. కాగా తాజాగా ఇలాంటి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వార్త ఎవరి గురించి అంటే మన మిర్చి బ్యూటీ రీచా గంగోపాధ్యాయ్.
ఈమె చేసింది తక్కువ చిత్రాలే అయినా గుర్తుండి పోయే పాత్రలు చేసింది ఈ అందాల తార. అప్పట్లో ఈ అమ్మడు స్పీడ్ చూసి అంతా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది అనుకున్నారు. కానీ కట్ చేస్తే అనతి కాలం లోనే ఇండస్ట్రీ నుండి కనుమరుగై పోయింది. అయితే ఇందుకు కారణం ఇవే అంటూ చాలా వార్తలే వినిపించాయి. హీరోయిన్ గా  అందం అభినయం కలిగి ఉన్న ఈ అందాల తార మొదట్లో అవకాశాలు అందుకుని పాపులర్ అయ్యింది. అయితే స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్స్ అయిపోయింది. మంచి సినిమాలే చేసినా కూడా ఈమెకు స్టార్ స్టేటస్ మాత్రం దక్కలేదని చెప్పాలి. ఊహించిన స్థాయిలో ఈమెకు గుర్తింపు రాలేదు.
ఇంకా కొన్ని సినిమాలు చేసి ఉంటే అంత అనుకున్నట్టు స్టార్ హీరోయిన్ అయ్యుండేది ఏమో...అయితే అనూహ్యంగా మధ్యలోనే ఆమె తన కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఆమె సినీ పరిశ్రమకు దూరం కావడానికి వెనుక ఓ స్టార్ హీరో ఉన్నాడు అని ప్రచారం జరుగుతోంది. ఒక స్టార్ హీరో ప్రేమలో పడ్డ రిచా అతడిని పూర్తిగా నమ్మి కెరియర్ కూడా పక్కన పెట్టిందట. వీరిద్దరూ అన్ని హద్దులు దాటి ప్రేమ ఊబిలో కూరుకుపోయారు అని, అయితే రిచా పెళ్లి మాట ఎత్తగానే ఆ హీరో పలు కారణాలు చెప్పి తనని దూరం పెట్టాడని దాంతో ఆమె కెరియర్ పై దృష్టి పెట్టలేక ఇలా కనుమరుగై పోయింది అని అంటున్నారు.  అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ రిచా గంగోపాధ్యాయ మాత్రం స్టార్ హీరోయిన్ అయ్యే హీరోయిన్ చెప్పాలి, కానీ ఏం చేస్తాం అందరికీ అన్ని కలిసి రావు కదా!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: