రష్మిక మందన్న కెరీర్ లో హిట్స్ ప్లాప్స్ ఇవే?

VAMSI
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లుగా కొనసాగుతున్న వారిలో రష్మీక మందన్న కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలం లోనే టాప్ పొజిషన్ కి చేరుకుంది ఈ బ్యూటీ. చలో చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి, డియర్ కామ్రేడ్‌ సినిమాతో 'నేషనల్ క్రష్' గా పేరు తెచ్చుకోవడమే కాకుండా నటిగా తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించింది రష్మిక. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ వరుస ప్రాజెక్టు లు చేస్తోంది ఈ చిన్నది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్ బాషల్లో నటిస్తూ స్టార్డం ను పెంచుకుంది. ఇక రీసెంట్ గా పుష్ప చిత్రం తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారి తన హవా చాటుతోంది.
దాంతో మరో సారి తన రెమ్యునరేషన్  ను భారీగా పెంచేసిందట ఈ కన్నడ సుందరి.  గతం లో ఒక్కో చిత్రానికి 1.75 నుండి 2 కోట్ల వ‌ర‌కూ  తీసుకుంటుండగా ఇపుడు మూడు కోట్లకు పెంచేసినట్లు తెలుస్తోంది. ఆమెకున్న డిమాండ్ చూసి దర్శక నిర్మాతలు సైతం సరే అంటూ అడిగినంత ఇచ్చేస్తున్నారు.  ఇక రష్మిక  మందన్న కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్ ల విషయానికి వస్తే ....
ఇప్పటి వరకు తెలుగులో ఆమె చేయగా అందులో ఎక్కువ హిట్స్ ను అందుకున్నాయి. తన మొదటి చిత్రం చలో సూపర్ హిట్ అందుకుంది. ఇందులో రష్మిక సరసన నాగశౌర్య హీరోగా నటించాడు.  ఆ తరవాత వచ్చిన గీత గోవిందం తన కెరియర్ కే యు టర్న్ గా మారి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందించింది.  దేవదాస్ సినిమా యావరేజ్ గా ఆడి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. డియర్ కామ్రేడ్ సినిమా  డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ సినిమా రష్మిక కెరియర్ కి ఫుల్ ప్లస్ అయ్యిందనే చెప్పాలి.  సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి అమ్మడి క్రేజ్ ఓ రేంజ్ లో పెంచేసింది.
భీష్మ సినిమా హిట్ ను అందుకోగా, కార్తీ తో తీసిన సుల్తాన్ చిత్రం ఫ్లాప్ అయ్యింది.  పుష్ప: ది రైజ్ మొదట కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఆ తరవాత బ్లాక్ బస్టర్ హిట్ బజ్ ను క్రియేట్ చేసింది. ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: